Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన 'సర్కారు వారి పాట' సినిమా మరో రికార్డును సాధించింది. ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. 'సర్కారు వారి పాట' కొత్త రికార్డుతో మహేష్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మహేష్‌కు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఇవ్వకపోయినా.. వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు పరుశురామ్ పెట్ల దర్శకత్వం వహించారు. మే 12 న రిలీజ్ అయిన 'సర్కారు వారి పాట' సినిమాకు మొదట నెగిటివ్ టాక్ నడిచినా.. షో.. షోకు పాజిటివ్ టాక్ పెరిగిపోయింది. 'సర్కారు వారి పాట ' అమెరికాలో కూడా దుమ్ము రేపింది. మొత్తం మీద ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మించారు.
సినిమాకు ప్లస్ పాయింట్స్
మహేష్ బాబు (Mahesh Babu) నటన 'సర్కారు వారి పాట' కు హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమా కథానాయిక కీర్తి సురేష్‌తో మహేష్ చేసిన లవ్ సీన్స్ ఆకట్టుకున్నాయి. కామెడీ సన్నివేశాల్లో కూడా మహేష్ అద్భుతంగా నటించారు అలాగే సినిమాకి తమన్ సంగీతం మరో ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలకు ముందే 'కళావతి', 'మ.. మ. మహేశా' పాటలు ఓ రేంజ్‌లో హిట్ అయ్యాయి. అనంత శ్రీరామ్ లిరిక్స్ యూట్యూబ్‌ను షేక్ చేశాయి. విలన్ రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రఖని తన నట విశ్వ రూపం చూపారు. ఇక వెన్నెల కిశోర్ తనదైన శైలిలో నవ్వులు పూయించారు.
వసూళ్లు ఎంత?
'సర్కారు వారి పాట' (Sarkaru Vari Paata) ప్రీ రిలీజ్ బిజినెస్ విలువ రూ. 120 కోట్లు. అయితే విడుదల తర్వాత ఇండియాలో, అమెరికాలో మొదటి వారం ఈ చిత్రం బాగానే కలెక్షన్ రాబట్టింది. రెండో వారంలో కలెక్షన్ కాస్త తగ్గింది. పలు సినిమాల రిలీజ్ కారణంగా కలెక్షన్ తగ్గింది. 'సర్కారు వారి పాట ' సినిమా మరో ఏడు కోట్ల రూపాయలు వసూళ్లు చేయాల్సి ఉంది.
స్పెషల్ పోస్టర్లు విడుదల
'సర్కారు వారి పాట' రిలీజ్ అయిన తొలి రోజు నుంచి కలెక్షన్ల పరంగా మోత మోగించింది. అంతేకాకుండా అమెరికాలో మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్లను రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేట కృష్ణమహల్ డీలక్స్, గోపాలపట్నంలోని మౌర్య థియేటర్లలో 'సర్కారు వారి పాట' చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది. 'సర్కారు వారి పాట' 100 రోజులు పూర్తి కావడంతో ప్రిన్స్ (Mahesh Babu) అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు.
Read More: Sarkaru Vari Paata: 'సర్కారు వారి పాట ' ప్రపంచ వ్యాప్తంగా చేసిన బిజినెస్ ఎంతంటే..?
Follow Us