సినిమా : టెన్త్ క్లాస్ డైరీస్
నటీనటులు : శ్రీరామ్, అవిక గోర్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల రామారావు, అర్చన, హిమజ, శివబాలాజీ, మధుమిత
సంగీతం: సురేష్ బొబ్బిలి
దర్శకత్వం : గరుడవేగ అంజి
రేటింగ్ : 3/5
కథా పరిచయం
ఈ సినిమా సోమయాజి (శ్రీరామ్) అనే ఓ గొప్ప సంపాదనపరుడి కథ. ఓ కంపెనీకి అధిపతి అయిన సోమయాజి ఏదో తెలియని మానసిక జబ్బుతో బాధపడుతుంటాడు. అందుకు కారణం ఎక్కువగా డబ్బు సంపాదించడమే అని, కెరీర్ రేసులో పడి సోమయాజి తన జీవితంలో అసలైన ఆనందాన్ని అనుభవించలేదని ఓ మానసిక వైద్యుడి ద్వారా తెలుసుకుంటాడు.
దాంతో కథానాయకుడు అసలైన ఆనందాన్ని వెతుక్కోవడంలో భాగంగా, చిన్నప్పడు తనతో పాటు చదువుకున్న మిత్రులను కలవాలని భావిస్తాడు. అందుకోసం అమెరికా నుండి రాజమండ్రికి వస్తాడు. ఈ క్రమంలో చిన్నప్పుడు తనతో ప్రేమలో పడిన చాందినిని (అవికా గోర్) కలవాలని భావిస్తాడు.
కానీ ఇదే సమయంలో కథానాయకుడికి కొన్ని అనుకోని సవాళ్లు కూడా ఎదురవుతాయి. మరి వాటిని అధిగమించే క్రమంలో హీరోకి ఎదురయ్యే అనుభవాలేమిటో తెలుసుకోవాలంటే.. ఈ సినిమా చూడాల్సిందే.
ఇలాంటి సినిమాలు ప్రధానంగా భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. గతంలో కూడా ఇలాంటి కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్' లాంటి సినిమాలు తెరకెక్కాయి. విచిత్రమేంటంటే, 'నా ఆటోగ్రాఫ్' సినిమాకు దర్శకత్వం వహించిన ఎస్. గోపాలరెడ్డి, ఈ టెన్త్ క్లాస్ డైరీస్ సినిమాకి కూడా ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించారు.
అలాగే ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. సురేష్ బొబ్బిలి తన సంగీతంతో ఈ సినిమాకి పూర్తి న్యాయం చేశారు.
సాంకేతిక విషయాలు
గరుడవేజ అంజి ఈ సినిమాతో తన టాలెంట్‌ను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. కానీ ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు కథను పక్కదోవను పట్టించిన ఫీలింగ్ కలిగించడం గమనార్హం. అలాగే చాలా చోట్ల సినిమా ముందుకు వెళ్లకుండా, నత్తనడకన సాగుతుంది.
నటీనటుల గురించి
సోమయాజి పాత్రలో శ్రీరామ్ (Sri Ram) బాగా నటించాడు. చాలా రోజుల తర్వాత తెలుగు తెర మీద కనిపించినా, ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది. అలాగే చాందిని పాత్రలో అవికా గోర్ కి (Avika Gor) మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలలో ఆమె నటన ఆకట్టుకొనే విధంగా ఉంది. ఇక వెన్నెల రామారావు, శ్రీనివాసరెడ్డి, అర్చన, హిమజ, నాజర్ మొదలైన వారు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
ప్లస్ పాయింట్స్
భావోద్వేగ అంశాలు
శ్రీరామ్, అవికా గోర్‌ల నటన
ఎస్. గోపాలరెడ్డి ఛాయాగ్రహణం
మైనస్ పాయింట్స్
ద్వితీయార్థంలోని కొన్ని అంశాలు
సినిమాలో కమర్షియల్ అంశాలు లేకపోవడం
కమర్షియల్ అంశాలు లేకపోయినప్పటికీ.. మీ చిన్ననాటి జ్ఞాపకాలను తిరిగి పొందడానికి ఈ సినిమాను చూసేయండి
Read More: హీరో గోపీచంద్ కోసమే ఈ సినిమా చూడాలి.. అయినా ఏం మిస్ అయ్యిందంటే ?
Follow Us