ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 1’(Ponniyin Selvan 1). ఈ సినిమాలో పలువురు స్టార్ నటీనటులు నటిస్తున్నారు. కల్కి క్రిష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఓ సీన్ కోసం మణిరత్నం పెద్ద సాహసమే చేస్తున్నారట. అందుకోసం వేల మంది ఆర్టిస్టులను సెలెక్ట్ చేశారట.
అంచనాలు పెంచుతున్న సినిమా
దక్షిణ భారతదేశాన్ని పాలించిన శక్తివంతమైన చోళ రాజుల కథగా 'పొన్నియిన్ సెల్వన్ 1' (Ponniyin Selvan 1) సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్లు సినిమాపై అంచానాలను మరింత పెంచాయి. రాజు కథ అంటే యుద్ధం ఉంటుందిగా. మణిరత్నం యుద్ధ సన్నివేశాలను గాఫ్రిక్స్‌తో కాకుండా రియల్‌గా చూపించేందుకు రెడీ అవుతున్నారు. పలు సీన్ల కోసం ఐదు వేల మంది జూనియర్ ఆర్టిస్టులను సెలెక్ట్ చేశారట.
5 వేల మంది ఆర్టిస్టులా!
రాజభవనంలో ఓ ముఖద్వారం దగ్గర చోళరాజు ప్రజలను కలిసే సన్నివేశాన్నిమణిరత్నం అద్భుతంగా చిత్రీకరించనున్నారు. దాదాపు 5 వేల మందితో ఆ సీన్‌ను చిత్రీకరించాలని ప్లాన్ చేశారట. కోవిడ్ సమయంలోనూ నిబంధనలను పాటిస్తూ ఆ సీన్‌ను తీస్తున్నారట. అన్ని వేల మందితో మణిరత్నం ఓ సీన్ చిత్రీకరించడం గొప్ప విషయమని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఐదు భాషల్లో విడుదల
'పొన్నియిన్ సెల్వన్ 1' చిత్రంలో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహ వంటి ప్రముఖులు నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 30న విడుదల కానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 'పొన్నియిన్ సెల్వన్ 1' సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు.
Read More : Ponniyin Selvan (పొన్నియిన్ సెల్వన్ 1) : ఈ రోజే టీజర్ రిలీజ్.. ఈ సినిమాకు సంబంధించిన టాప్ 10 విశేషాలు ఇవే
Follow Us