Happy Birthday Sushmita Sen: "సుస్మిత సేన్ బర్త్ డే స్పెషల్" - షకలక బేబీ అంటూ కుర్రకారు మనసు దోచిన విశ్వసుందరి. 

1994లో జరిగిన విశ్వ సుందరి పోటీల్లో విజేతగా నిలిచిన తొలి భారతీయురాలు సుస్మిత సేన్ (Sushmita Sen).

Happy Birthday Sushmita Sen: అందాల తార, మాజీ విశ్వసుందరి సుస్మిత సేన్ (Sushmita Sen) భారతదేశానికి అరుదైన గౌరవం తెచ్చారు. విశ్వసుందరి పోటీల్లో గెలిచిన మొదటి భారతీయురాలిగా సుస్మిత సేన్ నిలిచారు. సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలలోనూ సుస్మిత తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఓటీటీలోనూ తన సత్తా ఏంటో చూపిస్తున్నారు. నేడు సుస్మిత సేన్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె గురించిన పలు ఆసక్తికర విశేషాలు పింక్ విల్లా ఫాలోవర్స్ కోసం..

1994లో జరిగిన విశ్వ సుందరి పోటీల్లో విజేతగా నిలిచిన తొలి భారతీయురాలు సుస్మిత సేన్. మెడల్‌గా కెరీయర్ మొదలు పెట్టిన సుస్మిత సేన్ సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. 

సుస్మిత సేన్ 1975 నవంబర్ 19 తేదీన జన్మించారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో జన్మించారు. సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్‌లో చదువుకున్నారు. 

సుష్మిత సేన్ మాతృభాష బెంగాలీ. తండ్రి సుబీర్ సేన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విండ్ కమాండర్‌గా పనిచేశారు. తల్లి జ్యువలరీ డిజైనర్. దుబాయ్‌కు సంబంధించిన నగల షాపుకు ఓనర్‌గా వ్యవహరించారు. 

మోడలింగ్ చేస్తున్న సుస్మిత సేన్ 1994లో జరిగిన విశ్వసుందరి పోటీలలో పాల్గొన్నారు. ఆ పోటీల్లో విశ్వసుందరిగా కిరీటం గెలుచుకున్నారు.  ఇదే ఏడాది ఐశ్వర్య రాయ్  (Aishwarya Rai)ప్రపంచ సుందరి పోటీల్లో మొదటి స్థానంలో నిలిచారు. విశ్వసుందరి పోటీల్లో తన చేతులకు గౌజులకు బదులుగా సాక్సులు వేసుకున్నారు. అప్పుడున్న ఆర్థిక పరిస్థితి కారణంగా అలా చేయాల్సి వచ్చిందని సుస్మిత పలు ఇంటర్వ్యూలలో తెలిపారు.

1996లో సుస్మిత సేన్ దస్తక్ అనే హిందీ సినిమా (Cinema) తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. 1997లో నాగార్జున హీరోగా నటించిన రక్షకుడు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 

సుస్మిత సేన్ బీవీ నంబర్ 1 సినిమాకు గారూ ఉత్తమ సహాయ నటిగా ఫిలిమ్ ఫేర్ అందుకున్నారు. పలు సినిమాల్లో స్పెషల్ రోల్స్‌లో నటించి మెప్పించారు సుస్మిత.

హిందీ, తమిళ, తెలుగు భాషల్లో సుస్మిత సేన్ నటించారు. ఎక్కువగా హిందీ సినిమాల్లో సుస్మిత నటించారు. 1999లో అర్జున్ నటించిన ఒకేఒక్కడు సినిమాలో షకలక బేబీ అంటూ స్పెషల్ సాంగ్‌తో సుస్మిత కుర్రకారుకు అభిమాన నటిగా మారారు.

2017 సంవత్సరంలో సుస్మిత సేన్ విశ్వ సుందరి పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. అంతేకాకుండా పలు అందాల పోటీలకు న్యాయ నిర్ణేతగా సుస్మిత సేన్ వ్యవహరించి.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 

2020లో సుస్మిత ఆర్య అనే టీవీ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్‌లో నటనకు గానూ సుస్మితాకు ఉత్తమ నటిగా ఫిలిమ్ ఫేర్ ఓటీటీ అవార్డు లభించింది. 

సుస్మిత సేన్ ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకుని పెంచుతున్నారు. అంతేకాదు పలు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ మానవత్వం ఉన్న మనిషిగా మంచి పేరు తెచ్చుకున్నారు.

Read More: Tollywood: టాలీవుడ్‌లో సొంత జెట్ విమానాలు ఉన్న హీరోలు ఎవరో మీకు తెలుసా!

 

 

విశ్వసుందరిగా విజయం సాధించిన సుస్మిత సేన్.. మానవ సేవే మాధవ సేవ అంటూ ముందుకు సాగుతున్నారు. సుస్మిత సేన్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే షకలక బేబీ.
పింక్ విల్లా
You May Also Like These