సౌత్‌లో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ధనుష్ (Dhanush) ఒకరు. ధనుష్ తన నటనతో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు వారి ప్రశంసలు అందుకున్నారు. ధనుష్ నటించిన 'ది గ్రే మ్యాన్' సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాతో ధనుష్ గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. హాలీవుడ్ సినిమాల రేంజ్‌కు ఎదిగిన ధనుష్ తన జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారట.
హీరోగా పనికిరావన్నారు - ధనుష్
ధనుష్ (Dhanush) సినీ రంగంలోకి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారట. 'మూవీ కాదల్ కొండేన్' సినిమాతో ధనుష్ తమిళనాడులో పాపులర్ హీరోగా మారారు. ఈ సినిమాను తెలుగులో అల్లరి నరేష్ హీరోగా 'నేను' అనే టైటిల్‌తో రీమేక్ చేశారు. ధనుష్ సినిమా రంగంలోకి వచ్చిన కొత్తలో హీరోగా పనికిరాడంటూ కొందరు హేళన చేశారట.
ఆటోడ్రైవర్‌లా ఉన్నావ్ అంటే ఏడ్చేశాను - ధనుష్
ఓ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ధనుష్ (Dhanush) నే హీరో ఎవరని అడిగారట!. ధనుష్ తాను హీరో అని చెప్పకుండా.. వేరే వారిని చూపించారట. ధనుష్ హీరో అని తెలుసుకుని.. 'నువ్వు హీరోవా.. ఆటో డ్రైవర్‌లా ఉన్నావు' అంటూ కామెంట్ చేశారట. ఆ సంఘటన తనను ఎంతో బాధించిందని.. కారులో బోరున ఏడ్చానని ధనుష్ తెలిపారు. ఆ తర్వాత ధనుష్ ఆటో డ్రైవర్ హీరో కాలేడా అని తనకు తానే ప్రశ్నించుకున్నారట.
ధనుష్ ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా.. తనకు ఇష్టమైన నటనపై దృష్టి పెట్టారట. ధనుష్ బాడీ షేమింగ్‌పై కూడా ఎన్నో విమర్శలు వచ్చాయట. 'కాదల్ కొండేన్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ధనుష్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. సౌత్‌లో టాప్ హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ది గ్రే మ్యాన్ ఇంటర్వ్యూలో ధనుష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ట్రోల్స్ గురించి ఏమంటారు అనే ప్రశ్నకు ధనుష్.. ‘‘నీ లుక్స్ చూసి.. నిన్ను ట్రోల్ చేసిన వారిని చూసి బాధపడకు. ఎందుకంటే ఓ తమిళ స్నేహితుడో.. లేక హాలీవుడ్ హీరోనో ఇంగ్లీష్ సినిమా కోసం నీకు ఫోన్ చేయవచ్చు’’ అని సమాధానం చెప్పారు. ధనుష్ తనపై వచ్చిన ట్రోల్స్‌కు బాధపడినా.. తనకు తానే ధైర్యంగా ముందుకు సాగారు. ఓ టాప్ స్టార్‌గా ఎదిగారు.
Follow Us