నేను చిరంజీవి (Chiranjeevi Konidela)కే అభిమానిని.. ఆయన సినిమాలకు కాదు: ఆర్జీవీ (Ram Gopal Varma)

చిరంజీవి (Chiranjeevi Konidela)కి తాను వీరాభిమానిని అని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) అన్నారు

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) నిత్యం ఏవో కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela)పై పలు వ్యాఖ్యలు చేశారు. తాను చిరంజీవికి వీరాభిమానినని ఆర్జీవీ అన్నారు. చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ (GodFather) సినిమా చూశారా అని విలేకరి అడిగిన ప్రశ్నకు ఆర్జీవీ స్పందిస్తూ.. ఆ చిత్రాన్ని తాను ఇంకా చూడలేదన్నారు. చిరుకు మాత్రమే తాను ఫ్యాన్‌నని.. ఆయన సినిమాలకు కాదని చెప్పారు. 

గరికపాటి‌‌–చిరంజీవి వివాదం పైన ఈమధ్య ట్విట్టర్‌లో పలు పోస్టులు పెట్టిన ఆర్జీవీ.. ఈ కాంట్రవర్సీ మీద స్పందించారు. ప్రవచనాలు చెప్పేంత తెలివి ఉన్న వ్యక్తి.. చిరంజీవితో ఫొటోలు దిగిన వారిని ఏదైనా అనాల్సిందని గరికపాటిని ఉద్దేశించి ఆర్జీవి వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని వేదిక పైకి రాకుండా, ఫొటోలు దిగుతున్న వారిని గరికపాటి (Garikipati Narasimha Rao) వారించాల్సిందని.. అంతేగానీ చిరంజీవిని ఎందుకు అన్నారని ప్రశ్నించారు. చిరంజీవి ఏదో తప్పు చేసినట్లు గరికపాటి సీరియస్ అవ్వడం సరికాదని మండిపడ్డారు.

ఇకపోతే, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అసహనం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ కార్యక్రమంలో గరికపాటి ప్రసంగిస్తున్న సమయంలో వేదిక కింద చిరంజీవితో పలువురు ఫ్యాన్స్ సెల్ఫీలు దిగారు. ఇది నచ్చని గరికపాటి ‘ఫొటో సెషన్‌ ఆపకపోతే.. కార్యక్రమం నుంచి వెళ్లిపోతా’ అంటూ హెచ్చరించారు. దీంతో అక్కడున్న వారు ఆయనకు సర్దిచెప్పారు. కాసేపటికి చిరు వేదిక మీదకు రావడంతో గరికపాటి తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు.    

ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ గరికపాటిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చిరంజీవికి గరికపాటి క్షమాపణ చెప్పాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన్ను విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. తాజాగా జరిగిన ‘గాడ్‌ఫాదర్’ సక్సెస్‌మీట్‌లో కూడా పలువురు సెలబ్రిటీలు ఈ ఉదంతంపై మాట్లాడారు. దీని మీద గరికపాటి ఇంకా స్పందించలేదు. మరి, ఈ టాపిక్‌కు ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి. 

Read more: నా భార్యే నాకు గొప్ప క్రిటిక్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela)

You May Also Like These