నటుడు నాజర్(Nassar)కు చిన్నపాటి యాక్సిడెంట్ జరిగింది. అందులో ఆయన గాయపడినట్లు సమాచారం. నాజర్ నటిస్తున్న ఓ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పోలీస్ అకాడమీలో జరుగుతోంది. బుధవారం చిత్రీకరణ సమయంలో ఓ సీన్లో భాగంగా మెట్లు దిగుతున్న నాజర్ కాలు జారి కిందపడ్డారు. దీంతో ఆయన గాయపడ్డారని తెలుస్తోంది. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చికిత్స జరుగుతోందని సమాచారం. నాజర్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. నాజర్‌తో పాటు సుహాసిని, మెహ్రీన్, షాయాజీ షిండే కూడా షూటింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ఈ మధ్య కాలంలో నాజర్ ఎక్కువగానే వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టు ప్రచారం జరిగింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కారణంగా నాజర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వచ్చాయి. లాక్డౌన్ టైంలో నాజర్.. గుండె సంబంధిత సమస్యలతో బాధపడ్డారు.
అందుకే సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆరోగ్యంపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నారు అనే కామెంట్లు కూడా వినిపించాయి. అయితే ఈ వార్తలను నాజర్ (Nassar) భార్య ఖండించారు. 'ఆయనకు సినిమా అనేది ఊపిరి లాంటిది.. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ లు స్ప్రెడ్ చేయకండి' అని ఆమె క్లారిటీ ఇచ్చారు.
Read More : సైమా (SIIMA) అవార్డ్స్ నామినేషన్లలో పుష్ప (Pushpa), అఖండ (Akhanda), జాతిరత్నాలు (Jathiratnalu)!
Follow Us