Liger : 'లైగర్' ఫ్లాప్ అవ్వడానికి కారణమేమిటి ? రామ్ గోపాల్ వర్మ (RGV) చెప్పిన టాప్ 5 పాయింట్స్ !

శివ, రంగీలా, క్షణక్షణం, భూత్, సర్కార్, లాంటి సూపర్ హిట్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న తెలుగు డైరెక్టర్ ఆర్జీవీ (RGV)

'లైగర్' చిత్రం ఇటీవలే పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), అనన్య పాండే జంటగా తెరకెక్కింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ  విజయ్ తల్లిగా నటించగా, ప్రపంచ హెవీ వెయిట్ బాక్సర్ మైక్ టైసన్ మరో కీలక పాత్రలో నటించారు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమా విడుదలైంది. ఇటీవలే ఈ సినిమా ఫెయిల్యూర్ పై రామ్ గోపాలవర్మ స్పందించారు. ఆయన ఏమంటారంటే..?

కరణ్ జోహారే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం

ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి బాలీవుడ్ నిర్మాత్ కరణ్ జోహార్  (Karan Johar) కారణమని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. తనకు సంబంధం లేని ప్రాజెక్టులో చెయ్యి పెట్టడం వల్లే, సినిమా చతికిలబడిందని తెలిపారు. 

కరణ్ సినిమాలను బాలీవుడ్ బహిష్కరించింది

కరణ్ జోహార్ సినిమాలను బాలీవుడ్ బహిష్కరించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం తర్వాత చాలామంది కరణ్ సినిమాలను చూడడం మానేయడం వల్లే 'లైగర్' (Liger) సినిమా కూడా ఫ్లాప్ అయ్యిందని ఆర్జీవీ తెలిపారు. 

వినయం లేకపోవడం వల్ల ఆశ్చర్యపోయారు

సాధారణంగా బాలీవుడ్ ప్రేక్షకులు మన సౌతిండియా స్టార్ల వినయానికే మంత్ర ముగ్ధులవుతుంటారు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లు ఏ బాలీవుడ్ ఫంక్షన్‌కి వెళ్లినా, హుందాగా ఉంటారు. కానీ విజయ్ దేవరకొండ 'లైగర్' (Liger) సినిమా ఈవెంట్‌లో కాస్త అతిగా ప్రవర్తించారు. ఆయన యాటిట్యూడ్ కొందరికి నచ్చుండకపోవచ్చు. అది కూడా కారణం అయ్యుండవచ్చు. 

కానీ ప్రాథమిక కారణం కరణ్ జోహార్ ఒక్కడే

విజయ్ ప్రవర్తన విషయానికి వస్తే, ఆయన ఎప్పుడూ అలాగే ఉంటాడు. ఆయన యాటిట్యూడ్‌కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. కానీ అతడే 'లైగర్' (Liger) సినిమా పరాజయం కావడానికి పూర్తి కారణం అనేయలేం. కరణ్ జోహార్ ఏ మాత్రం అవగాహన లేకుండా ఈ ప్రాజెక్టులో చెయ్యి పెట్టడం వల్లే ఈ సినిమా దెబ్బతింది. 

హైప్ కూడా సినిమాకి మైనస్ అయ్యింది

ఈ సినిమాకి లేనిపోయి హైప్ క్రియేట్ చేశారు. దీంతో ప్రేక్షకులకు, విజయ్ అభిమానులకు విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. అందువల్ల కూడా ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. కరణ్ జోహార్ (Karan Johar) ఓ పెద్ద స్టార్ హీరో రేంజ్‌లో విజయ్‌కు అంత హైప్ తీసుకురావాల్సిన అవసరం లేదు. 

ఇవండీ.. 'లైగర్' సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలను చెబుతూ, ఆర్జీవీ పెట్టిన ముచ్చట్లు

Read More:  నిఖిల్‌ (Nikhil) హీరోగా నటించిన కార్తికేయ2 సినిమాపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) కామెంట్లు

 

You May Also Like These