RRR Movie: 'ఆర్ఆర్ఆర్' మూవీపై ఆస్కార్ విన్నర్ అసభ్యకర వ్యాఖ్యలు.. 'గే లవ్ స్టోరీ' అంటూ ట్వీట్!

ఆర్ఆర్ఆర్ మూవీ పోస్టర్, రసూల్ పూకుట్టి (RRR Movie Poster, Resul Pookutty)

టాలీవుడ్ ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి తెర‌కెక్కించిన 'ఆర్ఆర్ఆర్' (RRR Movie)మూవీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా హాలీవుడ్ ప్రముఖులు సైతం ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఫిదా అవుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌-రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా అద్భుతంగా న‌టించారు. 

అయితే, ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా స్థాయిని చాటి చెప్పిన “ఆర్ఆర్ఆర్” సినిమా పై ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజినీర్ రసూల్ పూకుట్టి (Resul Pookutty) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" సినిమాను "గే లవ్ స్టోరీ" గా అభివర్ణించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ డైరెక్టర్ మునీష్ భరద్వాజ్ ఆర్ఆర్ఆర్ అనే ఒక చెత్త సినిమాను 30 నిమిషాల పాటు చూసాను అని ట్వీట్ చేస్తే.. రసూల్ రీట్వీట్ చేస్తూ ఆర్ఆర్ఆర్ ఒక గే లవ్ స్టోరీ అంటూ ట్వీట్ చేశాడు. ఈ విషయం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇక, ఈ వ్యాఖ్యల పట్ల రసూల్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. సోషల్ మీడియాలో రసూల్ కు వ్యతిరేకంగా చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. దేశ ప్రజలు మెచ్చిన సినిమా, విదేశీ ప్రేక్షకులు సైతం మెచ్చుకుంటున్న సినిమాను ఒక భారతీయుడై ఉండి రసూల్ "గే లవ్ స్టోరీ" (RRR Gay Love Story) అని చీప్ కామెంట్ చెయ్యడం పట్ల ఆర్ఆర్ఆర్ అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. RRR సినిమా పై మీరు చేసిన వ్యాఖ్యలతో మీ రెస్పెక్ట్ పోయింది అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. అంతేకాకుండా ఇద్దరు విప్లవకారుల కథతో రూపొందిన ఈ సినిమాని అవమానించడం వల్ల రసూల్ క్షమాపణలు చెప్పాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. 

ప్రముఖ టాలివుడ్ నిర్మాత శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda) ఈ విషయంపై స్పందిస్తూ.. "RRR సినిమా ఒక గే లవ్ స్టోరీ అని నేను భావించడం లేదు. ఒకవేళ మీరు చెప్పినట్టు RRR సినిమా ఒక గే లవ్ స్టోరీనే అనుకుంటే.. అందులో తప్పేముంది? అసలు నువ్వు దాన్నెలా సమర్థించుకుంటావు? నీలాంటి గొప్ప వ్యక్తి నుంచి ఇలాంటి నీచమైన కామెంట్ రావడం నిజంగా శోచనీయం" అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. కామెంట్ల రూపంలో విమ‌ర్శలు వెల్లువెత్త‌డం వ‌ల్ల ర‌సూల్ ట్విట్ట‌ర్ వేదిక‌గా మ‌రోసారి స్పందించారు. త‌నంత‌ట తాను అన‌లేద‌ని.. ప‌బ్లిక్ డొమైన్‌లో ఉన్న‌దే చెప్పాను అంటూ మ‌రింత రెచ్చ‌గొట్టేవిధంగా పోస్ట్ చేశారు. 

రసూల్ పూకుట్టి నేపథ్యం


2009లో AR రెహ్మాన్ సంగీతం అందించిన "స్లమ్ డాగ్ మిలియనీర్" (Slumdog Millioniare) కు సౌంగ్ మిక్సర్ గా పని చేసారు ఇంజినీర్ రసూల్ పూకుట్టి. ఆ సినిమాకుగాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా AR రెహ్మాన్ ఆస్కార్ అవార్డు అందుకోగా, బెస్ట్ సౌండ్ మిక్సర్ గా రసూల్ పూకుట్టి కూడా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నారు. హిందీ, తమిళం, మలయాళం,తెలుగు సినిమాలకు సౌండ్ ఇంజినీర్ గా పని చేశారు రసూల్.

Read More: RRR Movie: ఆర్ఆర్ఆర్ ఓ 'గే' సినిమా అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్.. ఆర్జీవీని ఆడుకుంటున్న నెటిజన్లు!

You May Also Like These