Ponniyin Selvan 1: 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' టికెట్ ధ‌ర ముంబైలో అంత త‌క్కువా!.. మ‌నీ కోసం మ‌ణి ప్లాన్!

ముంబైలో 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' (Ponniyin Selvan 1) సినిమా టికెట్ ధ‌ర‌ను  రూ. 100 కు అమ్మాల‌ని మ‌ణిర‌త్నం సూచించార‌ట‌.

'పొన్నియిన్ సెల్వన్ 1' (Ponniyin Selvan 1) చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్‌తో త‌మిళ స్టార్ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తెర‌కెక్కించారు. చోళ రాజుల క‌థల పుస్త‌కాల ఆధారంగా ఈ సినిమాను మ‌ణిర‌త్నం రెండు భాగాలుగా చిత్రీక‌రిస్తున్నారు. మొద‌టి భాగం పొన్నియిన్ సెల్వ‌న్ 1 చిత్రం పాన్ ఇండియా సినిమాగా సెప్టెంబ‌ర్ 30 న రిలీజ్ కానుంది. ఈ సినిమా హిందీ వ‌ర్ష‌న్‌కు మ‌ణిర‌త్నం ఓ ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. ముంబైలో 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' టికెట్ ధ‌ర త‌క్కువ ఉండేలా ప్లాన్ చేశార‌ట‌. 

మ‌నీ కోసం మ‌ణి ప్లాన్

ద‌ర్శ‌క‌, నిర్మాత‌గా మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన చిత్రం 'పొన్నియిన్ సెల్వ‌న్' (Ponniyin Selvan 1) విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా త‌మిళ్, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో  సెప్టెంబ‌ర్ 30 న రిలీజ్ కానుంది. బాలీవుడ్‌లో బాయ్ కాట్ ట్రెండ్ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో అక్క‌డి థియేటర్‌, మ‌ల్టీప్లెక్స్‌ ఓన‌ర్ల‌తో మ‌ణిర‌త్నం చ‌ర్చ‌లు జ‌రిపార‌ట‌.

'పొన్నియిన్ సెల్వ‌న్ 1' సినిమా టికెట్ ధ‌ర‌ను ముంబైలో రూ. 100 కు అమ్మాల‌ని మ‌ణిర‌త్నం కోరార‌ట‌. అందుకు థియేట‌ర్ల ఓన‌ర్లు ఒప్పుకున్నారట‌. కానీ మ‌ల్టీపెక్స్ య‌జ‌మానులు ఒప్పుకున్నారా లేదా అనే విష‌యం తెలియాల్సి ఉంది.

త‌క్కువ రేటుకే టికెట్

బాలీవుడ్ ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం త‌గ్గించేశారు. పెరిగిన టికెట్ల ధ‌ర‌ల కార‌ణంగా నార్త్ ప్ర‌జ‌లు థియేట‌ర్ల‌కు వెళ్లేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించేందుకు మ‌ణిర‌త్నం ఈ ప్లాన్ అమ‌లు చేయ‌నున్నారు. ముంబైలో  'పొన్నియిన్ సెల్వ‌న్ 1' టికెట్‌ను కేవ‌లం రూ. 100 అమ్మ‌నున్నారు. ఈ ప్లాన్ స‌క్సెస్ అయితే.. 'పొన్నియిన్ సెల్వ‌న్' సినిమా నిర్మాత‌ల‌తో పాటు థియేట‌ర్ల య‌జ‌మానుల‌కు కాసుల పంట పండిన‌ట్టే.

'పొన్నియిన్ సెల్వన్‌ '  సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్ పై మణిరత్నం, సుభాష్ కరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఓ ప్రాచీన న‌వ‌ల ఆధారంగా 'పొన్నియిన్ సెల్వ‌న్' తెర‌కెక్కుతోంది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. 

Read More: Ponniyin Selvan 1: 'పొన్నియిన్ సెల్వ‌న్' లాంటి క‌థ‌లు అనేకం.. భార‌త‌దేశ చ‌రిత్ర గొప్ప‌ది - చియాన్ విక్ర‌మ్

Credits: Twitter
You May Also Like These