పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) దాదాపు 12 ఏళ్ల తరువాత తన సొంత గ్రామం మొగల్తూరుకు వెళ్లారు. తన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరయ్యారు. ఈ సంస్మరణ సభకు కృష్ణంరాజు, ప్రభాస్ అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తన కుటుంబసభ్యులతో కలిసి అభిమానులకు ప్రభాస్ అభివాదం చేశారు. 2010లో తన తండ్రి సూర్యనారాయణ రాజు మరణించిన సమయంలో కూడా ప్రభాస్ మొగల్తూరుకు వెళ్లారు. మళ్లీ 12 ఏళ్ల తరువాత సొంతూరులో 'డార్లింగ్' ఇలా కనిపించారు.
లక్షలాది మందికి భోజన వసతి
ప్రభాస్ (Prabhas) మొగల్తూరు రావడంతో, ఆ ప్రాంతానికి వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. ప్రభాస్‌ను చూడగానే ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. కృష్ణంరాజు సంస్మరణ సభకు వచ్చిన అభిమానుల కోసం, ప్రభాస్ కుటుంబం భోజన వసతులను ఏర్పాటు చేసింది. దాదాపు లక్ష మందికి భోజన ఏర్పాట్లు చేశారు. పలు రకాల నాన్ వెజ్ రెసిపీలతో 'రాజుల వంటకాలు' సిద్ధం చేశారు.
ప్రభాస్‌తో ఫ్యాన్స్ సెల్ఫీలు
తన పెదనాన్న సంస్మరణ సభకు తరలివచ్చిన అభిమానులను "లవ్ యూ డార్లింగ్" అంటూ ప్రభాస్ (Prabhas) పలకరించారు. అలాగే తన మీద ప్రేమతో ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రభాస్‌ను దగ్గర నుండి చూసిన అనేకమంది ఫ్యాన్స్, వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే పలువురు ప్రభాస్‌తో సెల్ఫీలు దిగారు. 12 ఏళ్ల తరువాత "రాజు" వచ్చారంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే కృష్ణంరాజు గారి సంస్కరణ సభకు వచ్చిన ప్రతీ ఒక్కరికి ఆయన సతీమణి శ్యామలా దేవి కృతజ్ఞతలు తెలిపారు.
Follow Us