‘బాహుబలి‘ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు ప్రభాస్ (Prabhas). ఇక అప్పటి నుంచి ఆయన అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. బాహుబలి తర్వాత ‘సాహో, రాధేశ్యామ్‘ సినిమాల్లో నటించారు.
అయితే అవేవీ కూడా అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్, సలార్‘ సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలను పూర్తి చేసి విడుదల చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు ప్రభాస్.
ఇక ‘మహానటి’ తర్వాత దుల్కర్ సల్మాన్ డైరెక్ట్‌గా తెలుగులో నటించిన సినిమా ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ క్రమంలో వరుస అప్‌డేట్లను ప్రకటిస్తున్నారు మేకర్స్. ఇటీవల విడుదలైన సీతారామం ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇప్పటివరకు 6 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
చివరి వారంలో ఈవెంట్..
మంగళవారం సాయంత్రం ‘సీతారామం‘ సినిమా తమిళ ట్రైలర్‌ను హీరో కార్తి విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ‘సీతారామం‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై చివరి వారంలో జరగనుంది. కాగా ఈ వేడుకకు ఒక స్టార్ హీరో గెస్ట్‌గా రానున్నట్లు టాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
‘సీతారామం‘ సినిమాలో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ క్యారెక్టర్‌లో నటించారు. మృణాళ్ ఠాకూర్ సీతామహాలక్మీ పాత్ర పోషించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ ‘సీతారామం‘ సినిమాను నిర్మిస్తున్నారు.
రష్మికా మందాన కశ్మీర్ ప్రాంతపు ముస్లిం అమ్మాయిగా కనిపించనున్నారు. అలాగే ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ ‘సీతారామం‘ సినిమాలో కీలకపాత్రలో నటించారు.
అయితే ఇటీవలే ఓ కొత్త వార్త తెరమీదికొచ్చింది. ‘సీతారామం‘ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్‌గా రానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.
అయితే, కొన్ని పత్రికలు ఈ వార్త పుకారు అయ్యే అవకాశం ఉందని కూడా వ్రాశాయి. ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వైజయంతీ బ్యానర్‌లో ‘ప్రాజెక్ట్ -కె‘ సినిమా చేస్తున్నారు. ఈ క్రమంలో అశ్వినీదత్.. ప్రభాస్‌ను గెస్ట్‌గా పిలిచారట.
Read More :‘ప్రాజెక్ట్ K’ సినిమా సెట్ నుంచి లంబోర్గిని కారులో దూసుకెళ్లిన ప్రభాస్ (Prabhas).. వీడియో వైరల్
Follow Us