టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప' సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ఈ యంగ్ హీరోకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో 'గ్రాండ్ మార్షల్ ఇండియా డే పరేడ్'కు అల్లు అర్జున్ భారత్ నుంచి నాయకత్వం వహించనున్నారు. అమెరికాలో 40వ భారత స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్ ఆగస్టు 21 తేదిన జరగనుంది. ఈ వేడుకల్లో అల్లు అర్జున్ పాల్గొననున్నారు.
న్యూయార్క్‌లో ప్రతి సంవత్సరం 'ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోషియేషన్' ఆధ్వర్యంలో 'ఇండియన్ ఇండిపెండెన్స్ డే' వేడుకలు జరుగుతాయి. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 'గ్రాండ్ మార్షల్ ఇండియా డే పరేడ్' నిర్వహిస్తారు. ఈ పరేడ్‌కు ఈసారి టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నాయకత్వం వహించనున్నారు.
అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సినిమాతో పలు కొత్త రికార్డులను తిరగరాశారు. దీంతో సౌత్‌తో పాటు నార్త్‌లోనూ అల్లు అర్జున్‌కు ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఇటీవలే 'పుష్ప' సినిమాలోని పాటలు మరో రికార్డును సృష్టించాయి. యూట్యూబులో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న పాటలుగా వార్తలలో నిలిచాయి.
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం కూడా దక్కింది. అమెరికాలో జరిగే భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అల్లు అర్జున్ నాయకత్వం వహించనున్నారు.
అమెరికాలో భారతదేశ 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఈ సారి ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమెరికాలో జరిగే కవాతులో అల్లు అర్జున్ గ్రాండ్ మార్షల్‌గా వ్యవహరించనున్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో జరిగే ఈ వేడుకల్లో ప్రముఖ గాయకులు శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్‌లు భారతదేశ గొప్పదనం తెలిపే పాటలను ఆలపించనున్నారు. తనకు దక్కిన గౌరవంపై అల్లు అర్జున్ (Allu Arjun) ఆనందం వ్యక్తం చేశారు.
Follow Us