'లైగర్' (Liger) సినిమాకు బాయ్ కాట్ సెగ.. ఘాటు వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)

ఆగస్టు 25న 'లైగర్‌' (Liger Promotions) సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సినీ ప్రమోషన్స్‌ జోరందుకున్నాయి.

ఇటీవలి కాలంలో బాలీవుడ్ సినిమాలపై బాయ్ కాట్ నినాదాలు చాలా ఎక్కువయ్యాయి. హిందీ సినిమాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బాయ్ కాట్ ట్రెండ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ‘లైగర్’ సినిమాను కూడా తాకింది. 'లైగర్' (Liger) సినిమాను చూడొద్దంటూ.. #BoycottLigerMovie అనే హ్యష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో తెగ ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదే సమయంలో మరొక పక్క విజయ్ దేవరకొండ అభిమానులు #UnstoppableLiger అనే హ్యష్ ట్యాగ్ తో.. రచ్చ చేస్తున్నారు.  

‘‘విజయ్ ఎంతో కష్టపడి ఒక స్టార్ గా ఎదిగాడు. అతన్ని ఎదగనివ్వండి. అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు.. లైగర్ సినిమా ప్రొడ్యూసర్ గా కరణ్ జోహర్ (Karan Johar) ఉంటే తప్పేంటి.. కరణ్ జోహర్ నిర్మాతగా ఉంటే విజయ్ దేవరకొండ ఎందుకు మూల్యం చెల్లించుకోవాలి. బాయ్ కాట్ ప్రచారం ఎందుకు చేస్తున్నట్టు’’ అని విజయ్ ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా  ప్రశ్నించారు.

అయితే, అంతకుముందు అమీర్ ఖాన్ నటించిన తాజా సినిమా 'లాల్‌సింగ్‌ చడ్డా' (Laal Singh Chaddha)పై సోషల్‌ మీడియాలో 'బాయ్ కాట్‌ లాల్‌సింగ్‌ చడ్డా' అనే ట్యాగ్‌లైన్‌ ట్రెండ్‌ చేయడంతో.. ఆ సినిమా విజయం సాధించలేకపోయింది. సోషల్‌మీడియాలో అమీర్‌కి కొంతమంది నెటిజన్లు మద్దతు ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఈ సినిమా విడుదలకు ముందే బాయ్ కాట్‌ ప్రచారం కావడంతో.. అమీర్‌ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు. 

కాగా, ఆగస్టు 25న 'లైగర్‌' (Liger Promotions) సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సినీ ప్రమోషన్స్‌ జోరందుకున్నాయి. ఇందులో భాగంగా.. విజయ్ తాజాగా బాలీవుడ్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో మీడియా.. ఆయన్ని బాయ్ కాట్‌ ట్రెండ్‌పై స్పందించాలని కోరింది. దీంతో విజయ్ స్పందిస్తూ.. ‘‘ఒక సినిమాపై ఎంతోమంది నటులతో పాటు వందలాది సినీకార్మికుల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఈ అంశాన్ని పట్టించుకోకుండా బాయ్ కాట్ అని ప్రకటించడం బాధ్యతారాహిత్యమే అవుతుంది. ఈవిధంగా బాయ్ కాట్ ట్రెండ్ ఎందుకు జరుగుతోందో అర్ధం కావడం లేదు. దీనివల్ల అమీర్ ఖానే (Aamir Khan) కాకుండా మొత్తం ఎకానమీని ఎఫెక్ట్ చేస్తున్నారు’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

అయితే.. విజయ్ 'లాల్‌సింగ్‌ చడ్డా' సినిమాపై మాట్లాడడం నచ్చనందుకే తాను నటించిన లైగర్‌ మూవీకి వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు కొంతమంది నెటిజన్లు స్పందిస్తున్నారు. మరికొంతమందేమో 'లైగర్‌' మూవీకి కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరిస్తుండడం వల్లే వ్యతిరేకిస్తున్నట్లు బాయ్ కాట్‌ ట్యాగ్‌లైన్‌తో ట్వీట్‌ చేస్తున్నారు. కానీ.. ఏది ఏమైనా బాయ్ కాట్‌ ట్రెండ్‌తో సినీ పరిశ్రమ నష్టపోతుందని, దీనికెలాగైనా ముగింపు పలకాలని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh ) కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'లైగర్' (Liger Release date). ఆగ‌స్ట్ 25న పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. 

Read More: Liger Promotions: 'లైగర్' ప్రమోషన్స్ లో విజయ్, పూరి జగన్నాథ్ ను హత్తుకొని భావోద్వేగానికి గురైన ఛార్మి..!

Credits: Twitter
You May Also Like These