సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara), తమిళ దర్శకుడు విఘ్నేష్ (Vignesh Shivan) ల పెళ్లి సందడి మొదలైంది. ఏడేళ్ల నుంచి నయన్, విఘ్నేష్‌లు ప్రేమించుకుంటున్నారు. ఈ పెళ్లి సందర్భంగా వధు, వరులిద్దరూ తమ పెళ్లి వేడుక గుర్తుండిపోయేలా, ఒకరికొకరు కానుకలు ఇచ్చుకుంటున్నారు. నయనతార క్రిస్టియన్, విఘ్నేష్ హిందువు. అయినా, వీరిద్దరూ వారి వారి సంప్రదాయాల పద్ధతిలోనే పెళ్లి చేసుకోనున్నారు.
శ్రీమతికి ఓ బహుమతి : విఘ్నేష్
నయనతారకు (Nayanthara) విక్కీ ఖరీదైన ఉంగరాన్ని కానుకగా ఇవ్వబోతున్నారట. వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని నయనతార వేలికి ఆయన తొడగనున్నారు. ఇక నయనతార కూడా తనకు కాబోయే భర్త కోసం భారీ బహుమతినే ఇవ్వనున్నారు.
కోట్ల రూపాయల వ్యయంతో, విఘ్నేష్ కోసం ఓ ఇంటిని నయన్ కొనుగోలు చేశారు. అలాగే పెళ్లైన తర్వాత దంపతులుగా కొత్త ఇంట్లోనే, వీరు కాపురం ఉండనున్నారు.
రిసెప్షన్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు
నయనతార (Nayanthara), విఘ్నేష్‌ల పెళ్లి జూన్ 9 న ఉదయం 8 గంటల 30 నిమిషాలకు జరగనుంది. పెళ్లికి సాంప్రదాయ దుస్తుల్లో రావాలంటూ వివాహ ఆహ్వాన పత్రికలో తెలిపారు. తమిళనాడులోని మహాబలిపురంలో నయన్, విక్కీల పెళ్లి జరగనుంది.
వీరి పెళ్లికి కుటుంబసభ్యులు, బంధువులు.. అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నారు. వివాహ రిసెప్షన్‌కు మాత్రం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారట. జూన్ 11న నయన్, విఘ్నేష్‌ల రిసెప్షన్ జరగనుంది.
Read More: అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన నయన్, విఘ్నేష్‌ల జంట
Follow Us