సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara), తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ (Vignesh Shivan)ల పెళ్లి వేడుక దగ్గర పడుతుంది. జూన్ 9న నయన్, విఘ్నేష్‌ల పెళ్లి తమిళనాడులోని మహాబలిపురంలో జరగనుంది. ఓ వైపు పెళ్లి పనులు.. మరోవైపు దేవాలయ దర్శనాలతో నయన్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తమ వివాహానికి వీఐపీలను ఆహ్వానించే పనిలో నయన్, విఘ్నేష్‌లు ఉన్నారు. ఇప్పటికే కొందరు అతిథులకు డిజిటల్ వీడియో ఇన్విటేషన్ కార్డ్‌ని పంపారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను నయనతార, విఘ్నేష్‌లు తమ వివాహానికి ఆహ్వానించారు. సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. నిర్మాతగా కూడా చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం ఉదయనిధి రాజకీయల్లోకి వెళ్లారు. ఎమ్మెల్యేగా ఉదయనిధి తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఉదయనిధి, నయనతార (Nayanthara) జంటగా ఎన్నో సినిమాలు చేశారు. నయనతార తన పెళ్లికి ఉదయనిధితో పాటు అతని తండ్రి సీఎం స్టాలిన్‌కు కూడా ప్రత్యేక ఆహ్వానం అందించారు.
నయనతార (Nayanthara), విఘ్నేష్‌ల పెళ్లి ముందుగా తిరుపతిలో జరుగుతుందని అందరూ అనుకున్నారు. ఈ జంట కూడా ముందు తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకుంది. ఆ తర్వాత షిర్డీ బాబా ఆలయంలో పూజలు జరిపారు. తమిళనాడులోని శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇక విఘ్నేష్ సొంతూరులో కుల దైవం అమ్మవారి దగ్గర పాలు కూడా పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. జూన్ 9న జరిగే నయన్, శివన్ వివాహా రిసెప్షన్‌కు సౌత్ ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరవనున్నారు. రాజకీయ నేతలను ఆహ్వానించారు. రజినీ కాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, చిరంజీవి, సమంత సూర్య, కార్తీ, శివ కార్తికేయన్, విజయ్ సేతుపతి వంటి సినీ ప్రముఖులను పిలిచారట.
Follow Us