కోలీవుడ్ యంగ్ పెయిర్ గౌతమ్ కార్తిక్ (Gautham Karthik) – మంజిమా మోహన్ (Manjima Mohan) వివాహబంధంలోకి అడుగు పెట్టారు. ఎంతోకాలం నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరూ కుటుంబసభ్యుల అంగీకారంతో సోమవారం మ్యారేజ్ చేసుకున్నారు. కుటుంబసభ్యులతోపాటు కొందరు సన్నిహితుల సమక్షంలో చెన్నైలోని ఓ హోటల్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొని గౌతమ్, మంజిమను అభినందించారు.
పట్టువస్త్రాల్లో మెరిసిపోతున్న గౌతమ్ – మంజిమ జోడీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరికి అభిమానులు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే, ‘దేవరట్టం’ సినిమా కోసం గౌతమ్ – మంజిమ కలసి పనిచేశారు. ఆ చిత్రం సమయంలోనే వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టారు. ఇద్దరిలో తానే తొలుత మంజిమకు ప్రపోజ్ చేశానని ఇటీవల గౌతమ్ తెలిపారు. సుమారు మూడేళ్ల నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు. పెద్దలు అంగీకరించడంతో ఇవాళ వివాహం చేసుకున్నారు. ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో మంజిమ, ‘కడలి’ చిత్రంతో గౌతమ్ తెలుగువారికి సుపరిచితులే.
కాగా, ఈ గౌతమ్ కార్తిక్ ఎవరో కాదు.. ‘అభినందన’, ‘అన్వేషణ’ తదితర సినిమాలతో ఆకట్టుకున్న నిన్నటి తరం నటుడు కార్తిక్ వారసుడే. భారతదేశం గర్వించే దర్శకుల్లో ఒకరైన మణిరత్నం తెరకెక్కించిన ‘కాదల్’ (తెలుగులో ‘కడలి’)తో చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఇక, ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మంజిమా మోహన్.. ఇందులో నాగ చైతన్య ప్రియురాలిగా నటించారు. ఆమె పోషించిన లీలా క్యారెక్టర్‌కు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్‌లోనూ నారా భువనేశ్వరి పాత్రలో యాక్ట్ చేసి ప్రేక్షకులను మెప్పించారు.
Follow Us