Movie Review : యాక్షన్‌, థ్రిల్లర్‌‌ కథాంశంతో ప్రేక్షకులను అలరించేలా రఘు కుంచె (Raghu Kunche) ‘రుద్రవీణ’

రఘు కుంచె (Raghu Kunche) విలన్‌గా నటించిన రుద్రవీణ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమా : రుద్రవీణ

నటీనటులు : శ్రీరామ్ నిమ్మల, ఎల్సా ఘోష్‌, శుభశ్రీ, రఘు కుంచె (Raghu Kunche)

సంగీతం : మహావీర్

దర్శకత్వం : మధుసూదన్ రెడ్డి

నిర్మాత : లక్ష్మణరావు రాగుల

విడుదల తేదీ : 28-10-2022

రేటింగ్ : 3 / 5

సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె (Raghu Kunche) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా రుద్రవీణ (Rudraveena). నిమ్మల శ్రీరామ్, ఎల్సా ఘోష్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. సాయి విల్లా సినిమాస్ పతాకంపై తెరకెక్కిన రుద్రవీణ సినిమాకు మధుసూదన్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన రుద్రవీణ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌‌, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు రఘు కుంచె నటిస్తుండడంతో రుద్రవీణ సినిమాపై పలువురికి ఆసక్తి నెలకొంది. ఈ సినిమా అక్టోబర్‌‌ 28వ తేదీన థియేటర్లలో విడుదలైంది.

కథ ఏంటంటే?

యానాంలో లాలప్ప (రఘు కుంచె) తన తమ్ముళ్లు ముత్తప్ప, కన్నప్పతో కలిసి చేపల బిజినెస్ చేస్తుంటారు. చేపల బిజినెస్ పేరుతో డ్రగ్స్ వ్యాపారం చేస్తుంటారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తూ ఉంటారు. మరోవైపు యానాంలోనే రుద్ర (శ్రీ రామ్ నిమ్మల) చిన్న పిల్లలకు క్రికెట్ నేర్పిస్తుంటాడు. లాలప్ప అనుచరులను చంపుతుంటాడు రుద్ర. తన మనుషులను ఎవరు ఎందుకు చంపుతున్నారో తెలియక ఊరంతా వెతుకుతూ ఉంటాడు లాలప్ప. జీవ హింస మహా పాపం అంటూ ఆర్గాన్ డొనేషన్ గురించి ప్రచారం చేస్తుంటారు ప్రియ (ఎల్సా). ప్రియతో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు రుద్ర. తన అనుచరులను చంపే వ్యక్తి కోసం లాలాప్ప వెతుకుతుండగానే.. ముత్తప్ప, కన్నప్పలను చంపేస్తాడు రుద్ర.  మరో వైపు జైల్లో ఉండే వీణ (శుభశ్రీ)కి ఉరిశిక్ష వేస్తుంది కోర్టు. వీణ ఎవరు ? లాలప్ప మనుషులను రుద్ర ఎందుకు చంపేస్తుంటాడు? రుద్రకు వీణకు ఉన్న సంబంధం ఏంటి? అనేది సినిమా కథ.

ఎవరెలా నటించారంటే?

మాస్‌, క్లాస్‌ రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌‌లో శ్రీరామ్ నిమ్మల బాగానే నటించారు. ఎమోషనల్ సీన్లలోనూ మెప్పించారు. రఘు కుంచె డిఫరెంట్‌ గెటప్‌తో కనిపించారు. అద్భుతమైన పర్ఫామెన్స్‌తో విలన్‌ పాత్రలో ఒదిగిపోయారు. ఇక, హీరోయిన్‌ ఎల్సా.. యూత్‌ను ఆకట్టుకునేలా నటించారు. రొమాంటిక్ సీన్లలో శ్రీరామ్, ఎల్సా కెమిస్ట్రీ బాగుంది. వీణ పాత్రలో శుభశ్రీ తన పాత్ర మేరకు నటించారు. లేడీ విలన్‌గా సోనియా నటన బాగానే ఉంది. ఎమోషనల్ రివెంజ్ డ్రామా కథను లవ్, రొమాంటిక్, కామెడీ ఎలిమెంట్స్‌తో సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు మధుసూదన్ రెడ్డి. యాక్షన్ సీన్లు, రొమాంటిక్ సీన్లలో మంచి మ్యూజిక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సంగీత దర్శకుడు మహావీర్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది.

ప్లస్ పాయింట్స్ : రఘు కుంచె (Raghu Kunche) నటన, ట్విస్ట్‌లు

మైనస్ పాయింట్స్ : రొటీన్ కథ, అక్కడక్కడా సాగదీసినట్టుగా ఉండడం

ఒక్క మాటలో.. లవ్‌ అండ్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌ ‘రుద్రవీణ’

Read More : Movie Review : బిగ్‌బాస్ ఫేమ్‌ అషు రెడ్డి (Ashu Reddy) నటించిన ‘ఫోకస్‌’.. ఓకే అనిపించేలా మర్డర్‌‌ మిస్టరీ

You May Also Like These