సినిమా : అలిపిరికి అల్లంత దూరంలో
నటీనటులు : రావణ్ నిట్టూరు, శ్రీనికిత
నిర్మాతలు : రమేష్ డబ్బుగొట్టు, పి.రెడ్డి రాజేంద్ర
సంగీతం : ఫణి కల్యాణ్
దర్శకత్వం : ఆనంద్ జె
విడుదల తేదీ : 18–11–2022
రేటింగ్ : 3 / 5
కాన్సెప్ట్ బాగుంటే చిన్న సినిమాలను కూడా ఆదరిస్తుంటారు మన ప్రేక్షకులు. అందుకే టాలీవుడ్‌లో పెద్ద సినిమాలకంటే చిన్న సినిమాలే ఎక్కువగా తెరకెక్కుతుంటాయి. కరోనా ప్రభావంతో వచ్చిన పాండమిక్‌తో ఓటీటీ కూడా బాగా పాపులర్ అయ్యింది. ఇక, అప్పటి నుంచి ఇండస్ట్రీలోకి కొత్త వాళ్లు చాలా మంది వస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన వారే కొత్త దర్శకుడు జె.ఆనంద్. ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘అలిపిరికి అల్లంత దూరంలో’. కొత్త నటీనటులతో ఈ సినిమాను తెరకెక్కించారు ఆనంద్.
రావణ్ నిట్టూరు, శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మ కంటి రవీందర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కాస్కేడ్ పిక్చర్స్ బ్యానర్‌పై యూనిక్ రాబరీ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన తెరకెక్కిన ‘అలిపిరికి అల్లంత దూరంలో’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ ఏంటంటే ?
వారధి (రావణ్ నిట్టూరు) తిరుపతిలో ఉండే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. ఫైనాన్షియల్‌గా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాడు. చిన్న చిన్న మోసాలు చేస్తూ, చిన్న వ్యాపారం చేస్తుంటాడు. అతడు ఉండే ప్రాంతానికి దగ్గరలో ఉండే వేంకటేశ్వర స్వామి గోశాలలో వాలంటరీగా పనిచేస్తుంటారు కీర్తి (శ్రీ నికిత). కీర్తితో ప్రేమలో పడతాడు వారధి. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారనే విషయం కీర్తి తండ్రికి తెలుస్తుంది.
చదువు లేదు, డబ్బు లేదు ఏమీ లేని నీకు నా కూతురుని ఇచ్చి పెళ్లి చేయలేనని, కనీసం డబ్బు ఉంటే పెళ్లి చేస్తానని అంటారు కీర్తి తండ్రి. దీంతో ఎలాగైనా డబ్బు సంపాదించి కీర్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు వారధి. సరిగ్గా అదే సమయంలో వేంకటేశ్వర స్వామికి రూ.రెండు కోట్లు ముడుపు చెల్లించడానికి వస్తాడు ఒక యాత్రికుడు. ఆ యాత్రికుడి దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి సెటిల్ అవ్వాలని కీర్తిని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు వారధి. ఆ రాబరీ చేసే సమయంలో వారధి ఎదుర్కొన్న ఇబ్బందులే ఏమిటి? ఏం జరిగింది ? చివరికి ప్రేమించిన అమ్మాయిని వారధి పెళ్లి చేసుకుంటాడా? అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే?
ఒక కుర్రాడి జీవితంలో జరిగిన విషయాలను ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశారు ‘అలిపిరికి అల్లంత దూరంలో’ సినిమాలో. రాబరీ చేసే విధానం, ఆ సమయంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. అయితే సినిమాలో పలు సీన్లు కావాలని సాగదీసినట్టు అనిపిస్తుంది.
ఎవరెలా నటించారంటే ?
మొదటి సినిమా అయినప్పటికీ రావణ్ తన క్యారెక్టర్‌కు న్యాయం చేశారు. నటనలో నేచురాలిటీ కనిపిస్తుంది. హీరోయిన్ శ్రీనికిత కూడా తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. మిగిలిన నటీనటులందరూ తమ పరిధి మేరకు నటించారు.
థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ ఆనంద్. తిరుపతిలోని అందమైన ప్రదేశాలలో షూటింగ్ చేసి ప్రేక్షకులను కనువిందు చేశారు. ఫణి కల్యాణ్ మ్యూజిక్ బాగుంది.
ప్లస్ పాయింట్స్ : కథ, లొకేషన్లు, సంగీతం
మైనస్ పాయింట్స్ : కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా ఉండడం, కొత్త నటీనటులు కావడం
ఒక్క మాటలో.. ‘అలిపిరికి అల్లంత దూరంలో’ మంచి థ్రిల్లర్
Read More : Movie Review : మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ‘గాలోడు’
Follow Us