ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'పుష్ప'. పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో 'పుష్ప'కు సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న 'పుష్ప 2'ను మరింత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్.
'పుష్ప 2' సినిమా బడ్జెట్‌ను ఇటీవలే రూ.350 కోట్లకు పెంచేశారు నిర్మాతలు. అలాగే ముందుగా అనుకున్న స్క్రిప్ట్‌లో కూడా అనేక మార్పులు చేసినట్లు సమాచారం. 'పుష్ప 2' సినిమాకు కేటాయించిన బడ్జెట్‌లో దాదాపు అరవై శాతానికి పైగా హీరో, దర్శకుడు రెమ్యూనరేషన్స్‌కే పోతోందని టాక్.
'పుష్ప 2' కోసం అల్లు అర్జున్ (Allu Arjun) రూ. 120 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. అలాగే మరో రూ. 80 కోట్లు సుకుమార్ పారితోషికమని తెలుస్తోంది. వీరిద్దరూ కలిపి రూ.200 కోట్లు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్. నిన్న మొన్నటి వరకు సినిమాకు రూ.30 కోట్ల వరకు తీసుకున్న అల్లు అర్జున్.. 'పుష్ప 2' సినిమా కోసం ఏకంగా రూ.120 కోట్లు డిమాండ్ చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సుకుమార్ కూడా మొన్నటి వరకు సినిమాకు రూ.12 నుంచి రూ.15 కోట్లు తీసుకునేవారు.
షూటింగ్స్‌పై సందిగ్ధం..
ఆగస్టు నుంచి 'పుష్ప 2' రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో అన్ని సినిమాల షూటింగ్స్ నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరికే వరకు, షూటింగ్స్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం లేదు. అందుకే ఈ నెలలో మొదలు కావాల్సిన 'పుష్ప 2', 'మహేష్ – -త్రివిక్రమ్' సినిమా షూటింగ్స్ కూడా ప్రస్తుతం హోల్డ్‌లో పడ్డాయి.
ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న 'పుష్ప 2' సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మికా మందాన హీరోయిన్‌గా నటిస్తున్నారు. సునీల్, ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్న 'పుష్ప 2' సినిమాను ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో తెరకెక్కిస్తున్నారని సమాచారం.ఈ సినిమాను 2023లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
Read More : హిందీ సినిమాల్లో నటించడంపై అల్లు అర్జున్ (Allu Arjun) కామెంట్లు వైరల్
Follow Us