ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi). అయితే ఇటీవల కృష్ణవంశీ తెరకెక్కించిన సినిమాలు రిలీజ్ కాలేదు. నక్షత్రం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మూడేళ్లకుపైనే అయ్యింది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సినిమా ‘రంగమార్తాండ’.
చాలా కాలం తర్వాత ఆయన నుంచి సినిమా వస్తుండడంతో రంగమార్తాండ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో కృష్ణవంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో మెగాస్టార్‌పై పలు కామెంట్లు చేశారాయన.
‘మెగాస్టార్ చిరంజీవితో ఒక యాడ్ చేశాను. ఆ యాడ్‌కు డబ్బింగ్ చెప్పే సమయంలో చిన్న సంఘటన జరిగింది. అన్నయ్యా.. మీకు చాలా ఇష్టమైన కారును మీకు బాగా ఇష్టమైన వ్యక్తికి గిఫ్ట్‌గా ఇచ్చేస్తారా అని సరదాగా అడిగాను. దానికి చిరంజీవి.. కావాలా అని అన్నారు. అది జరిగిన కొంత కాలం తర్వాత నన్ను ఇంటికి పిలిచారు. ఈ కారు నీకే గిఫ్ట్‌గా ఇవ్వాలని అనుకుంటున్నాను. అన్నయ్యా అని పిలుస్తున్నావ్ కదా. తీసుకోవా? అంటూ కారును గిఫ్ట్‌గా ఇచ్చేశారు.
చిరంజీవి మాటలు కాదనలేక కారు గిఫ్ట్‌గా తీసుకున్నాను. ఆ కారుతో ఎన్నో సాహసాలు చేశాను. ఒకసారి పర్సనల్ పనుల నిమిత్తం నందిగామ వెళ్లి తిరిగి వస్తున్నాం. ఆ సమయంలో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అంత పెద్ద ప్రమాదంలో కూడా నేను, డ్రైవర్ చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాం. ఆ కారు వల్లే ఈరోజు ప్రాణాలతో ఉన్నాను.
చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. ఎంతో కష్టపడి పైకి వచ్చారాయన. ఈ స్థాయికి చేరుకున్నా.. చిరంజీవి ఏం మారలేదు. అలాగే ఉన్నారు. అందుకే ఆయనంటే నాకు గౌరవం. చిరంజీవితో నాకు మంచి అనుబంధం కూడా ఉంది అని చెప్పారు కృష్ణవంశీ (Krishna Vamsi).
రమ్యకృష్ణతో విభేదాలు..
తన భార్య రమ్యకృష్ణతో విభేదాలపై కూడా కృష్ణవంశీ స్పందించారు. ముందు నుంచీ నాకు ఒక్కడినే ఉండడం ఇష్టం. బాధ్యతలు, బంధాలకు దూరంగా ఉండాలని అనుకుంటాను. అటువంటి నాకు రమ్యకృష్ణతో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కూడా మా ఇద్దరి జీవితాల్లో ఎటువంటి మార్పులు రాలేదు. ఒకరి ఇష్టాలు, అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటాం. మా ఇద్దరి మధ్య విభేదాలున్నాయని ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. వాటిల్లో నిజం లేదు. ఆ వార్తలు చూసి నవ్వుకుంటాం. పబ్లిక్ లైఫ్‌లో ఉన్నాం గనుక ఇలాంటి ప్రచారాలు మామూలే. వాటి గురించి పట్టించుకోవడం మానేస్తాం అని చెప్పుకొచ్చారు కృష్ణవంశీ .
‘నక్షత్రం’ తర్వాత కృష్ణవంశీ (Krishna Vamsi) తెరకెక్కిస్తోన్న సినిమా ‘రంగమార్తాండ’. మరాఠీలో సూపర్‌హిట్ అయిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్నారు.
Read More : Celebrity Love Marriages: సినీ 'ప్రేమ' బంధం .. డైరెక్టర్లను ప్రేమించి పెళ్లి చేసుకున్న కథానాయికలు వీరే !
Follow Us