Nithya Menen: చేపల మార్కెట్‌లో దర్శనమిచ్చిన భీమ్లా నాయక్ (Bheemla Nayak) బ్యూటీ నిత్యా మీనన్.. వీడియో వైరల్!

నిత్యా మీనన్ ఇటీవల అత్యంత సామాన్యురాలిలా చేపల మార్కెట్ (Nithya Menen in Fish Market)కు వెళ్లింది. చేపల వ్యాపారితో కాసేపు హస్క్ కొట్టింది.

తెలుగు, తమిళ, మలయాళ భాషల ఇండస్ట్రీలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటి నిత్యామీనన్ (Nithya Menen). ఒక‌ప్పుడు వ‌రుస చిత్రాల‌లో న‌టించిన నిత్యా మ‌ధ్య‌లో కొంత గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'గీత గోవిందం' సినిమాలో చిన్న పాత్ర పోషించిన ఈ బ్యూటీ, ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'భీమ్లా నాయక్' (Bheemla Nayak) సినిమాలో కథానాయకుడికి అర్థాంగి పాత్రలో నటించి మెప్పించింది.

నిత్యా మీనన్.. 8 సంవత్సరాల వయసులోనే 'ద మంకీ హు న్యూ టూమచ్' (1998) అనే ఆంగ్ల చిత్రంలో బాలనటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. 17 సంవత్సరాల వయసులో 2006లో ఒక కన్నడ సినిమాలో సహాయ పాత్ర పోషించింది. ఆ తర్వాత 'ఆకాశ గోపురం' అనే మలయాళ చిత్రంతో ఆమెకు ప్రధాన పాత్రల్లో నటించే అవకాశాలు వచ్చాయి.

మరోవైపు.. నిత్యా మీనన్ 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ (Telugu Indian idol) ప్రోగ్రాంలో జడ్జిగా కూడా వ్యవహరించింది. ఇలా సినిమాలు, షోలు, వెబ్ సిరీస్‌లతో బిజీ బిజీగా ఉంది ఈ అమ్మడు. ఈమె తాజాగా నటించిన వెబ్ సిరీస్ ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ జులై 8 నుంచి అమెజాన్‌లో టెలికాస్ట్ అవుతోంది.

ఇందులో నిత్యా మీన‌న్ న‌ట‌న‌పై ప్రేక్షకులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇక, ఆమె కెరీర్‌లో నిత్యా మీన‌న్ తన నటనకుగాను ఫిలింఫేర్ అవార్డ్స్‌తో పాటు రెండు నంది అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

అయితే.. దక్షిణాది భాషా చిత్రాల్లో ఒక వెలుగు వెలుగిన నిత్య.. నిజ జీవితంలో మాత్రం చాలా సింపుల్‌గా ఉంటుంది. అందుకు ఉదాహరణ ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆమె వీడియోనే. వివరాల్లోకి వెళితే.. నిత్యా మీనన్ ఇటీవల అత్యంత సామాన్యురాలిలా చేపల మార్కెట్ (Nithya Menen in Fish Market) కు వెళ్లింది. చేపల వ్యాపారితో కాసేపు హస్క్ కొట్టింది. నవ్వుతూ, చిరుతిండి తింటూ ముచ్చట పెట్టింది. అక్కడే ఉన్న స్థానికులు ఈ తతంగాన్నంతా వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యింది.  

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈమె ఒక సినిమా షూటింగ్‌లో భాగంగానే ఇలా కనిపించిందని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు.. ఇది సినిమా షూటింగ్‌ కాదంటూ.. సహజంగానే  నిత్యమీనన్ (Nithya Menen) అలా చేపలు కొనుగోలు చేయడానికి వచ్చినట్లు ఉందంటూ.. ఆమె సాదాసీదాతనానికి ఫిదా అవుతున్నారు. 

Read More: Nithya Menen: కోలీవుడ్ ద‌ర్శ‌కుడి పెళ్లి ప్ర‌పోజ‌ల్ ను తిర‌స్క‌రించిన నిత్యా మీన‌న్!

Credits: Youtube
You May Also Like These