Mahesh Babu: మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మేకర్స్.. ఆనందంలో ఫ్యాన్స్

Mahesh Babu: మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ సినిమా షూటింగ్ స్టార్ట్‌ కాకముందే రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (Mahesh Babu) త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు మహేష్.  మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా ఇది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు మహేష్‌ అభిమానులతోపాటు సినీ ప్రేమికులను కూడా ఎంతగానో అలరించాయి.

 ఇంకా సెట్స్‌పైకి వెళ్లని ఈ సినిమా గురించి చిత్ర బృందం ఆసక్తికర అప్‌డేట్‌ పంచుకుంది. ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’గా వస్తున్న ఈ సినిమాను 2023 ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు.

స్టైలిష్ లుక్‌ కోసం ప్రిన్స్..

 ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్‌ - త్రివిక్రమ్‌ కలయికలో రూపొందుతున్న తాజా చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా కోసం మహేష్‌ కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు.  హెయిర్‌ స్టైల్‌తోపాటు, ఫిజికల్‌గానూ కొత్తగా కనిపించనున్నట్టు తెలుస్తోంది.  

ఇటీవల ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ నేతృత్వంలో కసరత్తులు కూడా మొదలుపెట్టారు. ‘అరవింద సమేత’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాల కోసం జూనియర్ ఎన్టీఆర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ అనే ఫిట్‌నెస్‌ ట్రైనర్‌‌ వద్దే ట్రైన్‌ అయ్యారు. నిర్మాతలు చిత్రీకరణలను నిలిపివేయాలని నిర్ణయించడంతో మహేష్‌ (Mahesh Babu) – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ సినిమా షూటింగ్ ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. అన్నీ కుదిరితే, ఈ నెలలోనే ఎస్‌ఎస్‌ఎంబీ 28 సినిమా చిత్రీకరణ మొదలయ్యే చాన్స్‌ ఉంది.

Read More : Mahesh Babu Top Ten Movies: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు టాప్‌ 10 సినిమాలు.. ప్రత్యేకంగా మీకోసం

You May Also Like These