సూపర్‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu)కు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఎంత పెద్ద స్టార్‌గా ఎదిగినా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారాయన. సినిమా షూటింగ్స్, ఫ్యామిలీకే ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. సినిమా ప్రమోషన్ల సమయంలో తప్పితే మీడియాలో ఎక్కువగా కనిపించడానికి ఇష్టపడరు. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటారు ప్రిన్స్.
తెలుగు రాష్ట్రాలతోపాటు సౌత్‌లో పాపులారిటీ సంపాదించుకున్నారు మహేష్‌బాబు. సోషల్ మీడియాలో మహేష్‌బాబుకు క్రేజ్ పీక్స్‌లో ఉంటుంది. సినిమాలు, యాడ్స్ షూటింగ్స్‌తో ఎప్పుడూ బిజీగా ఉంటారు సూపర్‌స్టార్. షూటింగ్‌లు లేని సమయంలో ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక, టైం దొరికిన ప్రతిసారీ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌కు అలరిస్తూ ఉంటారు. మహేష్‌బాబు పెట్టే పోస్టులకు లైక్స్, షేర్లు, కామెంట్ల వర్షం కురుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ప్రస్తుతం విదేశాల్లో..
మహేష్‌బాబులో హాలీవుడ్ హీరోకు ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయని మురిసిపోతుంటారు అభిమానులు. ప్రస్తుతం ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లిన ప్రిన్స్ సోషల్ మీడియాలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ట్విట్టర్‌లో అత్యధిక మంది ఫాలో అవుతున్న సౌత్ ఇండియా స్టార్‌గా నిలిచారు. 13 మిలియన్ల మంది మహేష్‌బాబును ఫాలో అవుతున్నారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్‌ఎస్‌ఎంబీ28 (అయోధ్యలో అర్జునుడు) వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు మహేష్‌బాబు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయ్యింది. రెండో షెడ్యూల్ త్వరలోనే మొదలు కానుంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత మహేష్‌బాబు (MaheshBabu) దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.
Read More : సూపర్‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu)పై హీరోయిన్ భూమిక (Bhumika Chawla) ఇంట్రెస్టింగ్ కామెంట్స్..వైరల్
Follow Us