శ‌ర్వానంద్ (Sharwanand) హీరోగా ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham).. ఆకట్టుకుంటున్న ట్రైలర్!

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ థియేట్రికల్ ట్రైలర్‌ను (OkeOkaJeevitham Trailer) తెలుగు, తమిళం రెండు భాషలలో విడుదల చేశాడు.

టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్ (Sharwanand) ఫ‌లితంతో సంబంధంలేకుండా వ‌రుస‌గా సినిమాల‌ను చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ హీరో డిఫరెంట్ జోనర్‌ లో సినిమాలు చేస్తూ తనదైన వైవిధ్యాన్ని చూపిస్తున్నాడు. గతేడాది మొదట్లో 'శ్రీకారం' సినిమాతో ముందుకు వచ్చిన శర్వానంద్‌.. మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'మహా సముద్రం' పెద్దగా ఆకట్టుకోలేదు. అలాగే… 'ఆడాళ్ళు మీకు జోహార్లు' చిత్రం యావరేజ్ హిట్ అయింది.

ప్రస్తుతం ఈ యంగ్ హీరో తన 30వ చిత్రంగా ‘ఒకే ఒక జీవితం’లో (Oke Oka Jeevitham) నటిస్తున్నాడు. శ్రీకార్తిక్ ద‌ర్శ‌క‌త్వం ఈ చిత్రం టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కింది. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, పాట‌లు సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ చేశాయి. మేక‌ర్స్ తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ థియేట్రికల్ ట్రైలర్‌ను (Oke Oka Jeevitham Trailer) తెలుగు, తమిళం రెండు భాషలలో విడుదల చేశాడు. కాగా, ఈ ట్రైలర్ సినిమా ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిరేపుతోంది. శ‌ర్వానంద్ ఏదో మ్యూజిక్ కాంపిటేష‌న్‌కు ప్రాక్టీస్ చేస్తున్నట్లు ట్రైల‌ర్ ప్రారంభమ‌వుతుంది. అంత‌లోనే రీతూవ‌ర్మ (Ritu Varma) ‘కంగ్రాట్స్ ఆది.. ఫ‌స్ట్ రౌండ్‌లో సెలెక్ట్ అయ్యావ్’ అంటూ శ‌ర్వాతో ప‌లికిన సంభాష‌ణ ఆక‌ట్టుకుంటుంది. 

ఒకే ఒక జీవితం ట్రైలర్ లో ‘ఏదేమైనా పెళ్ళి క‌రెక్ట్ టైంలోనే జ‌ర‌గాలిరా’ అంటూ వెన్నెల కిషోర్ (Vennela Kishore) డైలాగ్‌తో నాజ‌ర్ ఎంట్రీ ఇస్తాడు. నాజ‌ర్ ఈ చిత్రంలో సైంటిస్ట్‌గా క‌నిపించ‌నున్నాడు. టైం ట్రావెల్ మిష‌న్‌తో నాజ‌ర్ ఈ ముగ్గురుని వాళ్ళ బాల్యంలోకి పంపిస్తాడు. అస‌లు వీళ్ళ‌ పాస్ట్‌లో ఏం జ‌రిగింది? మ‌ళ్ళీ వీళ్ళు గ‌తంలోకి ఎందుకు వెళ్ళాల‌ని అనుకున్నారు? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెర‌కెక్కిన‌ట్లు ట్రైల‌ర్ చూస్తే అర్థమవుతోంది.

ఇక, ఈ సినిమాలో శర్వానంద్ తల్లిగా అమల అక్కినేని (Akkineni Amala) అద్భుతంగా నటించగా.. రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్ గా కనిపిస్తోంది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి శర్వాకు స్నేహితులుగా అలరించారు.

డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. సుజిత్ సారంగ్ కెమెరా మెన్ గా చేస్తుండగా.. జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు. శ్రీకార్తిక్ (Shree Karthick) ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం తమిళంలో 'కణం' పేరుతో ఏకకాలంలో విడుదల కాబోతోంది.

Read More: Sharwanand : శర్వానంద్ సరసన రాశీఖన్నా.. టాలీవుడ్‌లో సరికొత్త కాంబినేషన్ !

Credits: pinkvilla
You May Also Like These