Liger : ‘లైగర్’ చిత్రాన్ని ఆ సినిమాతో పోల్చవద్దు, టైసన్ నాకు ఫ్రెండ్ .. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు

Liger : ‘లైగర్’ చిత్రంలో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తుండగా, అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం ‘లైగర్‌’. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందించారు.  పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ పతాకాలపై నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25వ తేదిన విడుదలకు సన్నద్ధమవుతోంది.  

ఈ సందర్భంగా  హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో విజయ్ దేవరకొండ కొన్ని ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. మరి ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే మీకోసం !

ఇది పాన్ ఇండియా లెవల్ సినిమా
"నేను ఎన్నో ఆశలతో సినీ ఫీల్డుకి వచ్చాను. తరుణ్ భాస్కర్‌తో కలిసి ‘పెళ్లి చూపులు’ చేశాక, నాకు ప్రేక్షకులు ‘అర్జున్ రెడ్డి’ లాంటి పెద్ద సక్సెస్ ఇచ్చారు. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్‌లో మన కథలను చెప్పే సత్తాను మనం పొందాం. ‘లైగర్‌’ సినిమా మీ అంచనాలను కచ్చితంగా చేరుకుంటుంది. మీకు వినోదాన్ని కచ్చితంగా అందిస్తుంది" అని విజయ్ తెలిపారు.  

‘అమ్మా నాన్న తమిళ అమ్మాయి’ సినిమాతో పోల్చవద్దు
 "ఈ సినిమాలో చాలా డైలాగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ‘వాట్ లగా దేంగే’ అనే డైలాగ్ చెప్పేందుకు నేను చాలా కష్టపడ్డాను. కానీ వేగంగానే ఆ సన్నివేశంతో కనెక్ట్ అయిపోయాను. అలాగే నత్తితో మాట్లాడడం కూడా నాకు ఏదో పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు. 

మరొక విషయం ఏమిటంటే.. చాలామంది ఈ సినిమాని ‘అమ్మా నాన్న తమిళ అమ్మాయి’ సినిమాతో పోల్చి చూస్తున్నారు. కానీ నేను గతంలో వచ్చిన సినిమా కథలను ఎంపిక చేసుకోను. కానీ ‘లైగర్‌’లో తల్లీ, కొడుకుల సెంటిమెంట్ మాత్రం ఉంటుంది" అని విజయ్ తెలిపారు.

డ్యాన్సులు అంటే భయపడ్డా .. టైసన్ ఇప్పుడు నా స్నేహితుడు
‘లైగర్‌’ సినిమాకి సంబంధించి నాకు అతి పెద్ద టాస్క్ ఏమిటంటే డ్యాన్సింగ్. కొన్ని స్టెప్పులు వేయడానికి చాలా కష్టపడ్డాను. కానీ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. అలాగే మైక్ టైసన్‌తో ఫైట్ సీన్ అంటే మా అమ్మ చాలా భయపడిపోయింది. కానీ ఇప్పుడు టైసన్ నాకు మంచి స్నేహితుడు. 

యూట్యూబ్‌లో సినిమాలు చూసి ఫ్యాన్స్ అయ్యారట
నాకు ఉత్తరాది ప్రేక్షకులతో కనెక్టివిటీ తక్కువ. కానీ మేం నార్త్ ఇండియాలో కూడా, ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్ కోసం చాలా టూర్లు చేశాం. వారు నా పట్ల చాలా అభిమానాన్ని కలిగి ఉండడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. చాలామంది యూట్యూబులో రిలీజైన నా డబ్బింగ్ సినిమాలు చూసి నాకు ఫ్యాన్స్ అయ్యారట. వారిని చూసి నాకు చాలా సంతోషం కలిగింది. 

ట్రోల్స్ అనేవి కామన్
ట్రోల్స్, విమర్శలు అనేవి చాలా కామన్. ఒకప్పుడు కాలేజీలో మంచి ర్యాంక్ రాకపోతే విమర్శించేవారు. ఇప్పుడు సినిమాలు చేస్తున్నప్పుడు, చాలా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతుంటావని అంటున్నారు. కనుక విమర్శలు అనేవి ఎప్పుడూ ఉంటాయి. 

ఇలా విజయ్ దేవరకొండ ‘లైగర్‌’ సినిమా కోసం నిర్వహించిన మీడియా సమావేశంలో తన మదిలోని భావాలను పంచుకున్నారు. 

Read More:  విజయ్ దేవరకొండ ‘లైగర్‌’ సినిమా శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్‌ ధర ఎంతంటే?

 

Credits: Instagram
You May Also Like These