Jyothika Birthday Special : "చంద్రముఖి" నుంచి "రాక్షసి" వరకు.. జ్యోతిక నటనా ప్రస్థానం ఎంతో స్పెషల్ !

జ్యోతిక (Jyotika)... దక్షిణాదిలో స్టార్ స్టేటస్ పొందిన ప్రముఖ నటి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆమె నటించారు.

ఈ ప్రపంచంలో ఏ యాక్టర్‌కైనా హిట్లు, ఫ్లాప్‌లు సహజం. జ్యోతిక (Jyotika) విషయంలోనూ అదే జరిగింది. ఆమె నటించిన తొలి సినిమా అట్టర్ ఫ్లాప్. అయినా నటనపై నమ్మకం పోగొట్టుకోలేదు జ్యోతిక. ఎగిసిన కెరటంలా మళ్లీ తన సత్తాను చాటేసింది. ఎన్నో అద్భుతమైన చిత్రాలలో.. అపురూపమైన పాత్రలకు ఆమె ప్రాణం పోశారంటే అది అతిశయోక్తి కాదు.

జ్యోతిక  (Jyotika)... దక్షిణాదిలో స్టార్ స్టేటస్ పొందిన ప్రముఖ నటి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆమె నటించారు. ప్రముఖ తమిళ హీరో సూర్యను జ్యోతిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నటిగానే కాకుండా.. నిర్మాతగా కూడా, పలు సినిమాలను నిర్మించి సక్సెస్ అయ్యారు. తన భర్తతో కలిసి పలు సామాజిక సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. జ్యోతిక పుట్టిన రోజు సందర్భంగా పింక్ విల్లా స్పెషల్ స్టోరి మీకోసం..

బాల్యం
జ్యోతిక అసలు పేరు జ్యోతిక సదానా. ప్రముఖ హీరోయిన్ నగ్మాకు సొంత చెల్లెలే జ్యోతిక. ఈమె తండ్రి చందర్ సదానా ప్రముఖ వ్యాపారవేత్త. ఆయన హిందువు కాగా.. తల్లి సీమా ముస్లిం. చందర్ సదానా మొదటి భార్య పిల్లలు నగ్మా, జ్యోతికలు. 

సీమా సదన్ రెండో భార్య పిల్లలు రోషిణి, సూరజ్. రోషిణి కూడా కొన్ని సినిమాలలో నటించారు. సూరజ్ దర్శకుడు ప్రియదర్శన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. జ్యోతిక ముంబైలోని లెర్నర్స్ అకాడమీలో పదవ తరగతి వరకు చదివారు. ఆ తర్వాత మీటీభాయ్ కాలేజ్‌లో సైకాలజీ డిగ్రీ పూర్తి చేశారు.

సినీ ప్రయాణం
1988లో జ్యోతిక  (Jyotika) "డోలీ సజా కే రఖ్నా" అనే చిత్రంతో బాలీవుడ్‌‌కి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా జ్యోతికకు అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు. దీంతో ఆమె ఇతర భాషా చిత్రాలలో కూడా నటించారు. ముఖ్యంగా తమిళ చిత్రాల ద్వారా తన టాలెంట్ నిరూపించుకోవాలనుకున్నారు జ్యోతిక. 

1999లో "వాలి" చిత్రంతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జ్యోతిక.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఏర్పడలేదు. అందరూ జ్యోతికను "తమిళ పొన్ను" అని ముద్దుగా పిలిచేవారు. "వాలి" చిత్రంలో నటనకు గాను జ్యోతికకు బెస్ట్ ఫిమేల్ డెబ్యూ కేటగిరిలో "ఫిలిమ్ ఫేర్" అవార్డు లభించింది. ఇక ఆ తర్వాత ఆమెకు ఆఫర్లు వెల్లువలా వచ్చాయి.

తమిళ చిత్రాలకు సంబంధించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా జ్యోతిక నిలిచారు. తెలుగులో జ్యోతిక చిరంజీవితో తన మొదటి సినిమా చేశారు. 2003లో రిలీజైన "ఠాగూర్" చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తరువాత రవితేజ సరసన నటించిన "షాక్" చిత్రం ఫ్లాప్ అవ్వగా.. నాగార్జునతో చేసిన "మాస్" సినిమా జ్యోతిక ఖాతాకి మరో బ్లాక్ బాస్టర్ హిట్‌ను జతపరచడం విశేషం.

చంద్రముఖిగా
సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రలలో నటించిన "చంద్రముఖి" చిత్రం 2005లో దక్షిణాదిలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాలో జ్యోతిక "చంద్రముఖి" పాత్రలో తన విశ్వరూపాన్నే చూపించి.. ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. ఈ పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోతుంది. 

తెలుగు ప్రేక్షకులకు తన నటన ద్వారా బాగా దగ్గరయ్యారు జ్యోతిక. అందుకే జ్యోతిక నటించిన తమిళ్ చిత్రాలన్నీ, తెలుగులోనూ డబ్ అయి.. ఇక్కడా రిలీజ్ అవుతుంటాయి. 

ఝాన్సీ, 36 వయసులో, దొంగ, జాక్ పాట్, బంగారు తల్లి, రక్త సంబంధం, వసుంధర మొదలైన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి. 2018లో రిలీజ్ అయిన "రాక్షసి" సినిమాలో జ్యోతిక నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థుల బాగును కోరే ఓ ఉపాధ్యాయని పాత్రలో ఆమె జీవించేశారనే చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో జ్యోతిక తాను నటించిన సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తూ, బుల్లితెర ప్రేక్షకులకు కూడా వినోదం అందిస్తున్నారు. 

సూర్య సతీమణిగా..
తమిళ స్టార్ హీరో సూర్యను జ్యోతిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం 2006లో జరిగింది. వీరిద్దరూ ఏడు సినిమాల్లో కలిసి నటించారు. పెళ్లి తరువాత కూడా జ్యోతిక కథా బలమున్న సినిమాల్లోనే నటిస్తున్నారు. అంతేకాదు సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాలను నిర్మిస్తున్నారు. సూర్య , జ్యోతిక దంపతులకు ఇద్దరు పిల్లలు. ఓ పాప.. ఓ బాబు ఉన్నారు. 

 

నిర్మాతగా

జ్యోతిక నిర్మాతగా కూడా పలు మంచి సినిమాలను నిర్మించారు. 36 వయసులో, మగువలు మాత్రమే, పొన్నగల్ వందాళ్, ఆకాశం నీ హద్దురా, జై భీమ్, ఓ మై డాగ్ వంటి సినిమాలను నిర్మించి ప్రొడ్యూసర్‌గా కూడా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. జ్యోతిక నిర్మించిన "ఆకాశం నీ హద్దురా" చిత్రం ఏకంగా ఐదు జాతీయ అవార్డులు గెలుచుకోవడం విశేషం. 

అవార్డులు
తన భర్త సూర్య‌ (Suriya). హీరోగా నటించిన "ఆకాశం నీ హద్దురా" చిత్రానికి జ్యోతిక నిర్మాతగా వ్యవహరించారు. ఉత్తమ చలనచిత్ర విభాగంలో ఈ సినిమా అవార్డును పొందగా.. జ్యోతిక ఆ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా గెలుచుకున్నారు. 

సేవా కార్యక్రమాలు
"అగరం ఫౌండేషన్"ను తన భర్త సూర్యతో కలిసి జ్యోతిక స్థాపించారు. తమిళనాడులోని నిరుపేద విద్యార్థులను ఈ ఫౌండేషన్ ద్వారా చదివిస్తున్నారు. అంతేకాకుండా, పేద పిల్లలకు పలు రకాల వైద్య సౌకర్యాలను అందిస్తున్నారు. శ్రీలంకలోని తమిళ శరణార్థులకు కూడా సూర్య, జ్యోతికలు సహాయం అందిస్తున్నారు. 

Read More: HBD Suriya: "నెపోటిజం"తో కాదు.. ప్రేక్ష‌కుల మ‌న‌సులు నెగ్గి ఉత్త‌మ న‌టుడైన హీరో సూర్య !

జ్యోతిక అంచెలంచెలుగా ఎదుగుతూ.. తన వంతుగా సినీ పరిశ్రమతో పాటు సమాజానికి కూడా సేవ చేస్తున్నారు. జ్యోతిక ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటూ పింక్ విల్లా మన ఆన్ స్క్రీన్
పింక్ విల్లా.
You May Also Like These