జబర్దస్త్ కమెడియన్ రఘు (Jabardasth Raghu) ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి వెంకట్రావ్ గురువారం రాత్రి మరణించారు. 74 సంవత్సరాల వెంకట్రావ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1947వ సంవత్సరం జూన్ 10వ తేదీన జన్మించిన వెంకట్రావ్ ఆర్మీలో పనిచేశారు.
రిటైర్మెంట్ తర్వాత ఇంటికే పరిమితమైన వెంకట్రావ్ గురువారం తుది శ్వాస విడిచారు. వెంకట్రావ్ మరణవార్త విన్న బంధువులు, స్నేహితులు, పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా, హాస్య నటుడిగా అనేక చిత్రాల్లో నటించిన రఘుకి అదుర్స్ సినిమా కమెడియన్‌గా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత జబర్ధస్ట్ కామెడీ షోలోనూ కమెడియన్‌గా చేసి మరోసారి ఆడియన్స్ మెప్పుపొందారు.
తండ్రి వెంకట్ రావు మృతితో బాధలో ఉన్న రఘు కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు, మిత్రులు సంతాపాన్ని ప్రకటించారు. సన్నిహిత మిత్రులు ఒక్కొక్కరిగా అతని ఇంటికి చేరుకుని రఘును ఓదారుస్తున్నారు. ‘అదుర్స్’ సినిమాలో తన కామెడీతో అందర్నీ మెప్పించి మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నారు రఘు.
ఆ తర్వాత జబర్దస్త్‌లో రోలర్ రఘు పేరుతో పాపులర్ అయ్యారు. జబర్దస్త్ నుంచి బయటకి వచ్చిన తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు రఘు (Jabardasth Raghu). ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోవడంతో సొంతూరు వెళ్లి వ్యవసాయం బిజినెస్ చేసుకుంటున్నారు.
Follow Us