బస్ కండక్టర్ స్టేజ్ నుంచి సూపర్‌స్టార్ రేంజ్‌కు ఎదిగారు రజినీకాంత్ (Rajinikanth) . అయితే అవేవీ ఆయనను మార్చలేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సామెతకు నిలువెత్తు రూపంగా, ఎగ్జాంపుల్‌గా ఉంటారు రజినీ.
విలువైన ఆస్తులు, ప్రజల్లో మంచి పేరు ఉన్నా తాను సంతోషంగా లేనని సూపర్‌స్టార్ రజినీకాంత్‌అన్నారు. చెన్నైలో నిర్వహించిన ‘హ్యాపీ సక్సెస్‌ఫుల్ లైఫ్ థ్రూ క్రియ యోగా’ కార్యక్రమంలో పాల్గొన్న రజినీ.. తన జీవితం గురించిన పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘బాబా’, ‘రాఘవేంద్ర’ సినిమాలు మాత్రమే తనకు ఆత్మ సంతృప్తిని ఇచ్చాయని చెప్పారు.
నేనింకా అలాగే ఉన్నా..
‘ఒక యాక్టర్‌గా చాలా సినిమాల్లో నటించాను. అయినప్పటికీ ‘బాబా’, ‘రాఘవేంద్ర’ సినిమాలు మాత్రమే నాకు ఆత్మ సంతృప్తిని ఇచ్చాయి. ఆ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మాత్రమే ఆ ఇద్దరు సద్గురువుల గురించి అందరికీ తెలిసింది. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులపై ఎటువంటి ప్రభావాన్ని చూపించాయంటే.. వీటిని చూసిన తర్వాత నా అభిమానుల్లో ఇద్దరు వ్యక్తులు సన్యాసం స్వీకరించారు.
కానీ, నేను మాత్రం ఇంకా నటుడిగానే కొనసాగుతున్నాను. హిమాలయాలు సాధారణమైన మంచు పర్వతాలు కాదు. అక్కడ ఎన్నో అద్భుత మూలికలు లభిస్తాయి. ఒకవేళ వాటిని తిన్నట్లైతే వారం రోజులకి సరిపడా శక్తి లభిస్తుంది. ఆరోగ్యం అనేది మనిషికి ఎంతో ముఖ్యం. ఒకవేళ మనం గనుక అనారోగ్యానికి గురైతే మనకు కావాల్సిన వాళ్లు తట్టుకోలేరు. నేను జీవితంలో ఎన్నో విజయాలు చూశాను. పేరు ప్రతిష్ఠలు, డబ్బు సంపాదించాను. అయినప్పటికీ సిద్ధులకు ఉండే ప్రశాంతతలో 10% కూడా నాకు లేదు. ఎందుకంటే అవన్నీ అశాశ్వతమైనవి’ అని రజనీకాంత్ వివరించారు. రజినీకాంత్ (Rajinikanth) చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Read More : హీరో మాధవన్ నటించిన ‘రాకెట్రీ’ సినిమాపై సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ప్రశంసలు
Follow Us