పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. ఈ పేరు చెబితే చాలు ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేస్తాయి. ఆయన నటించిన సినిమాలు, వాటి ద్వారా వచ్చిన క్రేజ్ అటువంటిది మరి. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి సినిమాతో మొదలైన పవన్ సినీ ప్రస్థానంలో భారీ హిట్ సినిమాలు ఉన్నాయి. తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, గబ్బర్‌సింగ్, వకీల్‌సాబ్, భీమ్లానాయక్ సినిమాలు పవన్‌ను పవర్‌స్టార్‌ను చేశాయి.
పవన్ కెరీర్‌లో సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న సమయంలో వచ్చిన సినిమా జల్సా. చాలాకాలంగా హిట్ కోసం పవన్ పడుతున్న తహతహను జల్సా సినిమా తీర్చింది. దాదాపుగా ఏడు సంవత్సరాల తర్వాత హిట్ కొట్టారు పవన్. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన జల్సా సినిమా.. రిలీజైన మొదటి రోజు నుంచే మంచి టాక్‌తో బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాగా నిలిచింది.
ఎన్నో రికార్డులు..
నైజాంలో రూ.10 కోట్ల షేర్ సాధించిన మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది. ఫస్ట్ వీక్‌లోనే రూ.21 కోట్లు కలెక్ట్ చేసి అప్పట్లో అరుదైన ఘనత సాధించింది. వెయ్యి స్క్రీన్‌లలో విడుదలైన మొదటి టాలీవుడ్ సినిమాగా కూడా ‘జల్సా’ రికార్డు నెలకొల్పింది.
కాగా పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా ‘జల్సా’ సినిమాను దాదాపు 500 షోస్‌తో సెప్టెంబర్ 2న రీ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో ‘జల్సా’ రీ రిలీజ్ ట్రైలర్‌ను యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ విడుదల చేశారు. మహేష్ బాబు వాయిస్ ఓవర్‌తో మొదలైన ట్రైలర్ ‘యుద్ధంలో గెలవడమంటే శత్రువుని చంపడం కాదు ఓడించడం’ అంటూ చెప్పే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) డైలాగ్‌తో ముగుస్తోంది.
Read More : పవన్ కల్యాణ్(Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’తో పోటీ పడనున్న నాని(Nani) ‘దసరా’!
Follow Us