Pelli Sandadi: పెళ్లి సందD" త్వరలో ఓటీటీలో సందడి చేయనుంది.. రోషన్, శ్రీలీల జంటగా మంచి మార్కులే కొట్టేశారు !

'పెళ్లి సందD' మూవీ పోస్టర్ (Pelli Sandadi Movie Poster)

టాలీవుడ్ ఫ్యామిలీ హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా, శ్రీలీల (Heroine Sree Leela ) హీరోయిన్‌గా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోణంకి తెరకెక్కించిన చిత్రం ‘పెళ్లి సందD’. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల.. తొలి సినిమాతోనే కుర్రకారును ఆకట్టుకుంది.

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తొలిసారిగా ఈ చిత్రంలో నటించారు. ఆయన శిష్యురాలు గౌరి రోణంకి తెరకెక్కించిన ఈ చిత్రం 2021 అక్టోబర్‌లో థియేటర్ల విడుదలై.. మంచి టాక్ సొంతం చేసుకుంది.

గత ఏడాది అక్టోబర్ 15న థియేటర్లలో ‘పెళ్లి సందD’ విడుదల అయ్యింది. ప్రస్తుతం దాదాపు ఎనిమిది నెలల తర్వాత మళ్లీ ఓటీటీలోకి వస్తోందీ సినిమా. జూన్ 24న... అనగా ఈ శుక్రవారమే జీ 5 ఓటీటీలో 'పెళ్లి సందD' (Pelli Sandadi Movie) డిజిటల్ రిలీజ్ అవుతుందట.

''పెళ్లి సందD చేయడానికి రెడీనా? మా సినిమా రేడీ! ముహుర్తం: 24 జూన్! అందరూ ఆహ్వానితులే'' అని 'జీ 5' ఓటీటీ ఈ సందర్బంగా తన ట్విటర్ ఖాతాలో పేర్కొంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఆయన తండ్రి శివశక్తి దత్తా, శ్రీధర్ సీపాన కథా సహకారం అందించారు. 

నేడు ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతుందటే, రిలీజ్‌కు ముందే తమ ఓటీటీ పార్ట్‌నర్‌ ఎవరో.. ఆ చిత్రం ఎప్పుడు డిజిటల్ మాధ్యమంలోకి వస్తుందో నిర్మాతలు ఖరారు చేసుకుంటున్నారు. అలాంటిది ‘పెళ్లి సందD’ లాంటి మంచి సినిమా ఇన్ని రోజులకు ఓటీటీలో రావడంతో పలువురు నిర్మాతలు ఆలోచనలో పడ్డారు.

విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరు తెలిసిందేమిటంటే.. ‘పెళ్లి సందD’ సినిమా మొదట ఓటీటీ (Zee5 OTT) డీల్ కుదరలేదట. సినిమా థియేటర్‌లో రిలీజై మంచి టాక్ తెచ్చుకున్నాకే.. మళ్లీ ఓటీటీల నుండి ఆఫర్లు వచ్చాయట. దీంతో నిర్మాతలు కాస్తా ఎక్కువ పైకం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇన్నాళ్లకు పెళ్లిసందD కి ఓటీటీ మోక్షం లభించింది. 

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన శ్రీలీలకు (Sree Leela) వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. కుర్ర హీరోలు ఆమెనే హీరోయిన్‌గా రికమెండ్ చేస్తున్నారట. టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందంటే చాలు.. అందరి దృష్టి ఆమె వైపే ఉంటుంది కదా. దీనికి కారణం తెలుగులో హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉండటమే. 

Read More: Actress Sreeleela: వైరల్ అవుతున్న 'పెళ్లి సందD' బ్యూటీ శ్రీలీల బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు!

You May Also Like These