టాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన సినిమాల్లో ‘సీతారామం’ (Sita Ramam) కూడా ఒకటి. 'యుద్ధంతో రాసిన ప్రేమ కథ' అనే హ్యాష్ ట్యాగ్‌కు తగట్టుగానే దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్‌పై అశ్వినీదత్ 'సీతారామం' సినిమాను నిర్మించారు.
ఈ సినిమాలో రష్మిక మందన్న కాస్త నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో డిలీట్ చేసిన ఓ సీన్‌ను నిర్మాతలు మళ్లీ రిలీజ్ చేశారట. ప్రస్తుతం ఆ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కలెక్షన్ల మోత
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'సీతారామం' చిత్రం ఆగస్టు 5 తేదిన విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ అయిన తొలి రోజు నుంచే థియేటర్లను షేక్ చేస్తోంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను ఇటీవలే హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశారు. బాలీవుడ్‌లోనూ 'సీతారామం' సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది.
డిలీట్ సీన్ ఏంటంటే?
ఈ చిత్రంలో రష్మిక పాకిస్థాన్ అమ్మాయి పాత్రలో నటించింది. తన ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకొనే క్రమంలో ఆమె ఇండియాకి వస్తుంది. అయితే ఆమె సమస్యతో ఓ అందమైన ప్రేమకథ కూడా ముడిపడి ఉంటుంది. ఆ కథలో భాగంగానే సీత అనే ఆమెను కలిసి, ఓ ఉత్తరాన్ని అందజేసే బాధ్యత రష్మిక మీద పడుతుంది. దీంతో సీతను వెతుక్కుంటూ హైదరాబాద్ చేరుకుంటుంది రష్మిక.
హైదరాబాద్‌లోని నూర్జహాన్ ప్యాలెస్‌కు వచ్చిన రష్మికకు, క్యాబ్ డ్రైవర్‌కు మధ్య ఓ ఆసక్తికరమైన సన్నివేశం ఉంటుంది. అయితే ఆ సీన్‌ను మేకర్స్ డిలీజ్ చేశారట. ప్రస్తుతం అదే సీన్‌ను మళ్లీ రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలిపారు. ఇంతకీ డిలీట్ చేసిన ఆ సీన్ ఏమిటంటే..?
ఓ టాక్సీ డ్రైవర్ రష్మిక మర్చిపోయిన బ్యాగ్‌ను, పాస్‌పోర్టును ఆమెను తిరిగి అందజేస్తాడు. ఆ డ్రైవర్‌కు బదులిస్తూ 'ఇండియాలో కూడా నీలాంటి వాళ్ళున్నారన్న మాట' అని అంటుంది రష్మిక. దానికి డ్రైవర్ బదులిస్తూ 'ఇండియాలో అందరూ నాలానే ఉంటారు. మీ బ్యాగ్ తీసుకెళ్లి, నా దేశం పరువును మీతో పంపలేను కదా మేడం’ అని జవాబిస్తాడు. ఈ సీన్‌ను మేకర్స్ తొలుత డిలీట్ చేశారు. ఇప్పడు మళ్లీ రిలీజ్ చేశారు.
Read More: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) ‘సీతారామం’ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
Follow Us