దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సీతారామం'. 'వైజయంతీ మూవీస్' సమర్పణలో 'స్వప్న సినిమా' పతాకంపై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు. స్టార్ హీరోయిన్ రష్మికా మందాన, దర్శకుడు తరుణ్ భాస్కర్, సుమంత్, గౌతమ్ మీనన్, భూమిక కీలక పాత్రలు పోషించారు.
సీతారామం సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది.ఆగస్టు 5వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతోంది. మొదటి వారం సీతారామం సినిమా సూపర్‌గా కలెక్ట్ చేసింది. అప్పటి నుంచి మంచి వసూళ్లు రాబడుతున్న సీతారామం సినిమా కలెక్షన్లు 9వ రోజు కూడా బాగానే ఉన్నాయి.
9 రోజుల కలెక్షన్లు గమనిస్తే :
నైజాం 4.89 Cr
సీడెడ్ 1.31 Cr
ఉత్తరాంధ్ర 2 Cr
ఈస్ట్ 1.12 Cr
వెస్ట్ 0.79 Cr
గుంటూరు 0.94 Cr
కృష్ణా 1.05 Cr
నెల్లూరు 0.49 Cr
ఏపీ + తెలంగాణ 12.59 Cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.32 Cr
ఓవర్సీస్ 4.8 Cr
మిగిలిన వెర్షన్లు 3.48 Cr
వరల్డ్ వైడ్ 22.19 Cr
'సీతారామం' సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.16.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌కు రూ.17 కోట్లు షేర్ రాబట్టాల్సి ఉంది. 9 రోజులు పూర్తయ్యేసరికి సీతారామం సినిమా రూ.22.19 కోట్ల షేర్ రాబట్టి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాల్సి ఉంది. కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పటికీ దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) సీతారామం సినిమా కలెక్షన్లు బాగానే ఉండడం విశేషం.
Read More : Dulquer & Mrunal: 'సీతారామం' (Sitaramam) సక్సెస్ మీట్ లో మెరిసిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్..!
Follow Us