Brahmastra: 'బ్రహ్మాస్త్రం' సినిమా విశేషాలను దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు. 'బ్రహ్మాస్త్రం' కథ గురించి పలు ఆసక్తికరమైన విషయాలతో సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సినిమా కథను తనకు ముందుగానే తెలిపారని చెప్పారు. అస్త్రాల వెనుక ఉన్న అసలు కథను రాజమౌళి వివరించారు. 'బ్రహ్మాస్త్రం' చిత్రం కోసం కొత్త స్టైల్లో ప్రమోషన్ మొదలు పెట్టారు రాజమౌళి.
అస్త్రాల కథ - రాజమౌళి
అయాన్ ముఖర్జీ తనను 2016లో కలిసి 'బ్రహ్మాస్త్రం' కథను తెలిపారని రాజమౌళి (SS Rajamouli) తెలిపారు. హిందూ పురాణాల ఆధారంగా చేసుకుని రాసిన కథ 'బ్రహ్మాస్త్రం' అన్నారు. శాస్త్రాల ప్రకారం మనిషి మనుగడకు మూలకారణాలు పంచ భూతాలన్నారు. పంచభూతాలను కంట్రోల్ చేసే శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల గురించి అయాన్.. అద్భుతంగా తెరకెక్కించారన్నారు. అన్నింటికి కన్నా ప్రేమ శక్తి గొప్పదని..ఆ శక్తి గురించి తెలుపుతూ విజువల్ వండర్‌గా 'బ్రహ్మాస్రం' చిత్రాన్ని చిత్రీకరించారన్నారు.
వానరాస్త్రకు కింగ్ కాంగ్‌కు ఉన్నంత బలం ఉంటుంది. ఈ అస్త్రాన్ని ధరించిన వారు ఎంత దూరమైనా ఎగరగలరట. అలాగే నంది అస్త్రానికి వేయి ఒంగోలు గిత్తల శక్తి ఉంటుంది. ఇవన్ని బ్రహ్మా శక్తి నుంచి పుట్టే అస్త్రాలు.. ఆ అస్త్రాలను ఉపయోగించే సూపర్ హీరోల గురించిన కథగా 'బ్రహ్మాస్త్రం' చిత్రంలో మరో హైలెట్‌గా నిలిచిందని రాజమౌళి తెలిపారు. రాజమౌళి (SS Rajamouli) సమర్ఫణలో 'బ్రహ్మాస్త్రం' సెప్టెంబర్ 9న డిస్నీ సంస్థ రిలీజ్ చేయనుంది.
మూడు భాగాలుగా బ్రహ్మాస్త్రం
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ , అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రహ్మస్త్రం’.టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. పురావస్తు శాఖ నిపుణుడు అజయ్ విశిష్ఠ్ పాత్రలో నాగార్జున కనిపించనున్నారు. ఈ చిత్రంలో ప్రొఫెసర్ అరవింద్ చతుర్వేది పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించారు.
విలన్ దమయంతి పాత్రలో మౌనీ రాయ్ నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కూడా ఓ సైంటిస్ట్ పాత్రలో కనిపిస్తారట. 'బ్రహ్మాస్త్రం' మూడు భాగాలుగా తెరకెక్కుతుంది. 'బ్రహ్మాస్త్రం' మొదటి భాగం శివ పేరుతో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 9న విడుదల కానుంది.
Brahmastra: RRR సినిమా సక్సెస్ అయ్యాక, ఎన్టీఆర్‌కు పెరిగిన ఫాలోయింగ్.. బాలీవుడ్ ఈవెంట్‌లకు ఆహ్వానం !
Follow Us