Brahmastra : 'బ్ర‌హ్మాస్తం' నుంచి అల్ల‌రి మోత సాంగ్ రిలీజ్.. అద‌ర‌హో ర‌ణ్‌బీర్ స్టెప్పులు

Brahmastra : ర‌ణ్‌బీర్ క‌పూర్ (Ranbir Kapoor), అలియా భట్ న‌టించిన 'బ్ర‌హ్మాస్తం' సినిమా నుంచి మేక‌ర్స్ అల్ల‌రి మోత పాట‌ను విడుద‌ల చేశారు.

Brahmastra : బాలీవుడ్ స్టార్ కపుల్ ర‌ణ్‌బీర్ క‌పూర్ (Ranbir Kapoor), అలియా భట్ న‌టించిన 'బ్ర‌హ్మాస్తం' చిత్రం సెప్టెంబ‌ర్ 9 తేదీన‌ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. సినిమా విడుద‌ల‌కు ఇంకా నాలుగు రోజులే ఉండ‌టంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ల జోరును మ‌రింత పెంచారు. ఈ చిత్రం నుంచి అల్ల‌రి మోత సాంగ్‌ను రిలీజ్ చేశారు. ర‌ణ్‌బీర్ ఉత్స‌హాంగా దేవాల‌యంలో పాడే పాట‌గా అల్ల‌రి మోత పాట సాగింది. నాగార్జున‌, అమితాబ్ బ‌చ్చ‌న్, షారూక్ ఖాన్ వంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో స్పెష‌ల్ పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. 

అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన 'బ్ర‌హ్మాస్త్రం' (Brahmastra) తెలుగు వ‌ర్ష‌న్‌ను ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజ‌మౌళి స‌మ‌ర్పిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ ఈ సినిమాను ఎలా చిత్రీక‌రించార‌నే విజువ‌ల్స్ అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రుస్తున్నాయి. ఈ సినిమా నుంచి మేక‌ర్స్ అల్ల‌రి మోత పాట‌ను విడుద‌ల చేశారు. ఈ సినిమాకు ప్రియ‌తమ్ సంగీతం అందించారు. చంద్ర‌బోస్ లిరిక్స్ రాశారు. "మ‌న అల్ల‌ర‌ల‌ర్ల‌రి మోత మోగేనే.." అంటూ న‌కేష్ ఆజీజ్ ఆల‌పించారు. 

పురావస్తు శాఖ నిపుణుడు అజయ్‌ విశిష్ఠ్‌ పాత్రలో నాగార్జున కనిపించనున్నారు. ఈ చిత్రంలో ప్రొఫెసర్‌ అరవింద్‌ చతుర్వేది పాత్రలో అమితాబ్‌ బచ్చన్ న‌టించారు. విల‌న్ దమయంతి పాత్ర‌లో మౌనీ రాయ్ న‌టించారు. బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కూడా ఓ సైంటిస్ట్ పాత్ర‌లో క‌నిపిస్తార‌ట‌. 

భారీ బ‌డ్జెట్ సినిమా

'బ్ర‌హ్మాస్త్రం' మూడు భాగాలుగా తెర‌కెక్కుతుంది. 'బ్ర‌హ్మాస్త్రం' మొద‌టి భాగం శివ పేరుతో  హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్‌ 9న విడుదల కానుంది. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ అండ్ స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూ. 300 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మించాయి. బ్ర‌హ్మాస్త్రం విడుద‌ల త‌రువాత ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. 

Read More: Brahmastra : 'బ్ర‌హ్మాస్త్రం' ప్రీ రిలీజ్ ప్రోమో విడుద‌ల‌.. అంచ‌నాలు మ‌రింత పెంచిన విజువ‌ల్స్

Credits: Twitter
You May Also Like These