'ఆర్.ఆర్.ఆర్' సినిమా తర్వాత రామ్ చరణ్ (Ram Charan)కు ఫాలోయింగ్ పెరిగింది. అల్లూరిని పోలిన పాత్రలో రామ్ చరణ్ అదరగొట్టారని ఇటు సౌత్‌లో.. అటు నార్త్‌లోనూ మంచి ప్రశంసలు అందుకుంటున్నారు ఆయన. ఓటీటీలో ఆర్.ఆర్.ఆర్. రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌కు ప్రపంచ స్థాయి అభిమానులు, ఫాలోవర్స్ ఒక్కసారిగా పెరిగారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉందంటూ విదేశీయులు కామెంట్లు పెడుతున్నారు.
కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్న రామ్
రామ్ చరణ్ (Ram Charan) తన నటనతో అన్ని భాషల వారికి దగ్గరవ్వాలని చూస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఆర్.ఆర్.ఆర్. సృష్టించిన రికార్డుతో రామ్ కొత్త ఐడియాలతో ముందుకు వెళుతున్నారు. తన తండ్రి చిరంజీవితో కలిసి ఇటీవలే 'ఆచార్య'లో నటించారు రామ్ చరణ్.
వీరిద్దరూ మొదటిసారి కలిసి నటించిన 'ఆచార్య' ఫ్లాప్ అయింది. దీంతో హిట్, ఫ్లాప్‌లు అనేవి సినిమాలకు సహజం అంటూ భావించి.. తండ్రీ కొడుకులు ఇద్దరూ సినిమాలతో బిజీ అయిపోయారు. తమ అభిమానులకు నచ్చే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు.
విక్రమ్ 2లో చెర్రీ!
కమల్ హాసన్ 'విక్రమ్' సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. 'విక్రమ్' ట్రైలర్‌ను ఇటీవలే రామ్ చరణ్ (Ram Charan) లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే 'విక్రమ్ 2'లో రామ్ చరణ్ నటిస్తున్నారనే వార్త కూడా ప్రస్తుతం వైరల్ అయ్యింది. అయితే, అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.
ఇక రామ్ నటిస్తున్న 'RC 15' చిత్రానికి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. శంకర్ అంటే ఇండియాలోని అన్ని భాషల వారికి అభిమానం. దీంతో నేషనల్ లెవల్‌లో రామ్ చరణ్ సినిమాకు పేరు వస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
సల్మాన్ సలహా ఫాలో అవుతారా?
బాలీవుడ్‌లోకి రామ్ చరణ్ (Ram Charan) రీ ఎంట్రీ ఇవ్వాలని కొందరు హీరోలు సలహా ఇచ్చారట. 'తుఫాన్' సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంటర్ అయ్యారు రామ్ చరణ్. అయితే ఆ సినిమా హిట్ కాలేదు. పైగా రామ్ చరణ్‌పై నెగెటివ్ కామెంట్లు కూడా రావడం గమనార్హం.
'తుఫాన్' సినిమాలో రామ్ చరణ్ నటన పై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. ఆయనకు హావభావాలే లేవంటూ పలువురు కామెంట్లు కూడా చేశారు. అప్పటి నుంచి బాలీవుడ్ వైపు చూడలేదు రామ్ చరణ్. అయితే 'ఆర్ఆర్ఆర్' సక్సెస్.. రామ్ చరణ్ రియల్ టాలెంట్ అంటే ఏమిటో బాలీవుడ్‌కి పరిచయం చేసింది.
ఇక సల్మాన్ ఖాన్ చిరంజీవి సినిమా 'గాడ్ ఫాదర్'లో నటిస్తున్నారనే వార్త, ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది.. ఇటీవలే సల్మాన్ చిరు ఇంటికి వెళ్లారు. అక్కడ జరిగిన పార్టీలో మాట్లాడుతూ రామ్ చరణ్ మళ్లీ హిందీ చిత్రాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చిరును కోరారట.
దీంతో సల్మాన్ ఖాన్ సపోర్ట్‌తో రామ్ చరణ్ (Ram Charan) హిందీ సినిమా చేయనున్నారని.. ఓ టాక్ నడిచింది. హిందీ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఓ మూవీ రామ్ చరణ్ చేస్తే బాగుంటుందని సల్మాన్ అన్నారట. బలమైన కథ ఉంటే, బాలీవుడ్ నటులతో కలిసి సినిమా చేసేందుకు తనకు అభ్యంతరం లేదని రామ్ బదులిచ్చారని కూడా తెలుస్తోంది. ఏదేమైనా, రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ అభిమానులు సంబరపడుతున్నారు.
Follow Us