Advertisement

Nandini Rai: అవకాశాల ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 2 బ్యూటీ నందినీ రాయ్..!

Nandini Rai: రెండేళ్ళ కింద బిగ్ బాస్ షోలోకి వచ్చి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన ముద్దుగుమ్మ నందిని రాయ్ (Nandini Rai). చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది ఈ హైదరాబాదీ అమ్మాయి. అయితే, అంతకంటే ముందు కొన్ని సినిమాలు చేసినా కూడా ఈమెకు అంతగా గుర్తింపు రాలేదు. ‘మాయ’, ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘సిల్లీ ఫెలోస్’.. వంటి చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమస్ కాలేకపోయింది నందినీ రాయ్. 

అయితే నాని హోస్ట్ గా వ్యవహరించిన ‘బిగ్ బాస్ సీజన్ 2’ (Biggboss Season 2) లో ఎంట్రీ ఇచ్చి బాగా పాపులర్ అయ్యింది. అందులోకి వెళ్లిన చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుంది. ఈ క్రమంలోనే పలు అందాల పోటీల్లోనూ పాల్గొంది. పేరుకు హైదరాబాద్ అమ్మాయే అయినా.. నందినీ రాయ్ ఉత్తరాదిలో ఫేమస్ అయింది. దీంతో బాలీవుడ్‌లోనే మొదటి అవకాశం అందుకుంది. ఈ క్రమంలోనే ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. 

అయితే, ఈ భామ ఇప్పుడు మరింతగా సన్నబడి గ్లామర్ డోస్.. మరింతగా పెంచిందనే చెప్పొచ్చు. ఇటీవల ఈమె వైట్ ఇన్నర్ తో చేసిన ఫోటోషూట్ కు సంబంధించిన పిక్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతన్నాయి. ఈ మధ్యనే ‘మెట్రో కథలు’ అనే చిత్రంలో ఓ బోల్డ్ పాత్ర పోషించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరిన్ని బోల్డ్ పాత్రలలో నటించడానికి రెడీ అన్నట్టు ఈ హాట్ ఫోటో షూట్ (Hot Photo Shoot) తో హింట్ ఇచ్చినట్టు స్పష్టమవుతోంది.  

కాగా, ఈ భామ ప్రతీ వారం రోజులకు ఓసారి కచ్చితంగా కొత్త ఫోటోషూట్ చేయడం అనేది ఆనవాయితీగా మార్చుకుంది నందిని రాయ్. చేసిన ప్రతీసారి సెగలు పుట్టించేలా నందిని (Nandini Rai) ఫోటోలు ఉంటున్నాయి. వాటిని చూసిన తర్వాత దర్శక నిర్మాతలు స్పందించకపోతారా అని వేచి చూస్తుంది ఈ భామ. కచ్చితంగా తన హాట్ షోకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో కనిపిస్తుంది నందిని. మరి ఈమె నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

Read More : Nandini Rai: ఐట‌మ్ సాంగ్స్ తో అద‌ర‌గొడుతున్న‌ బిగ్ బాస్ సీజ‌న్ 2 బ్యూటీ నందినీ రాయ్!

Advertisement
You May Also Like These
Advertisement