ఒక సినిమా విజయం కథ, కథనం మీద ఎంత ఆధారపడి ఉంటుందో సంగీతం , సాహిత్యం మీదా అంతే ఆధారపడి ఉంటుంది. పాటల్లోని సంగీతం శ్రోతలను ఆహ్లాదపరిస్తే దానిలోని సాహిత్యం వారిని ఆలోచింపజేస్తుంది.అలాంటి పాటలు రాసే అతికొద్దిమంది సినీ గేయరచయితల్లో చంద్రబోస్ (Chandrabose) ఒకరు.
‘తాజ్ మహల్’ చిత్రంలోని ‘మంచుకొండల్లోని చంద్రమా..’ పాటతో సినీ ఇండ్రస్టీలోకి అడుగుపెట్టారు చంద్రబోస్. ఇప్పటివరకు దాదాపు 850కిపైగా సినిమాల్లో 3,600 పైచిలుకు పాటలు రాశారు.
మనసుకు హత్తుకునే సాహిత్యం..
చంద్రబోస్ రాసిన ‘నీ నవ్వుల తెల్లదనాన్ని..’, ‘చీకటితో వెలుగే చెప్పెను..’ పాటలకు నంది, ఫిలింఫేర్, సైమా అవార్డులు అందుకున్నారు. ఆయన కలం నుంచి జాలు వారిన మరో అద్భుత గీతం అహింస సినిమాలోని ‘నీతోనే.. నీతోనే..’. ఈ పాటలో ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే నమ్మకం, భావాలను మనసుకు హత్తుకునేలా వర్ణించారు చంద్రబోస్. సిద్ శ్రీరామ్, సత్య యామిని గాత్రం ఈ పాటను అభిమానులకు మరింత దగ్గరచేసింది.
భావయుక్తమైన సాహిత్యంతో స్వరపరిచిన పాటలు ఎన్ని రోజులైనా ఎక్కడో దగ్గర వినిపిస్తూనే ఉంటాయి. అందరినీ అలరిస్తూనే ఉంటాయి. అలాంటి పాటల జాబితాలో చేరిన ఈ పాట విడుదలైన కొన్ని రోజుల్లోనే మిలియన్లలో వ్యూస్‌ను సొంతం చేసుకుని యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.
తేజ దర్శకత్వంలో..
ప్రముఖ దర్శకుడు తేజ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా ‘అహింస’. లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనుమడు దగ్గుబాటి అభిరామ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. చాలాకాలం తర్వాత ఆర్‌పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్న సినిమా ఇది.
ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి.కిరణ్ అహింస సినిమాను నిర్మిస్తున్నారు. అభిరామ్ సరసన గీతిక తివారి హీరోయిన్గా నటిస్తుండగా నటి సదా, కమల్ కామరాజు కీలక పాత్రలు పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్, లిరికల్ సాంగ్‌కు మంచి స్పందన లభించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Read More : God Father Movie Review : రాజకీయ కేళిలో నమ్మినవారికి అండగా నిలిచే "గాడ్ ఫాదర్ " !
Follow Us