అడవి శేష్ మేజర్ (Major) సినిమా కలెక్షన్లు దుమ్ములేపుతున్నాయి. ఇండియాతో పాటు అమెరికాలోనూ 'మేజర్' వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. అమెరికాలో ఏకంగా మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ, అగ్రరాజ్యం ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. అడవి శేష్ (Adivi Sesh) నటించిన 'మేజర్' చిత్రం యూఎస్‌లో సైతం భారీ హిట్ సాధించడం గొప్ప విషయమే అంటున్నారు సినీ విశ్లేషకులు.
తాను 'మేజర్' కథను ప్రతీ భారతీయుడికి తెలిసేలా చేయాలని భావించానని ఈ సందర్భంగా అడవి శేష్ చెప్పారు. తన లక్ష్యం నెరవేరిందన్నారు. 'మేజర్' మిగతా సినిమాల్లా కాదని... సందీప్ ఉన్నికృష్ణన్ త్యాగమయ కథను సెల్యూలాయిడ్ పై చూపించాలనే తన తపన కార్యరూపం దాల్చిందన్నారు. 'మేజర్' సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం, తనకు సంతోషంగా ఉందన్నారు.
మేజర్ (Major) అమెరికాలోని బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. శశి కిరణ్ దర్శకత్వంలో విడుదలైన 'మేజర్' మూవీ అమెరికాలో 600 స్క్రీన్స్‌తో, 325 లోకేషన్స్‌లో విడుదలైంది. 'మేజర్' జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 'మేజర్' రిలీజ్ అయిన వారంలోపే, ఒక మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. అడవి శేష్ సినిమా చూసిన పలువురు ఎన్నారైలు చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు.
అడవి శేష్ (Adivi Sesh) సినిమాలకు అమెరికాలో ఇంత బిజినెస్ జరగడం ఇదే మొదటి సారి. 'మేజర్' సినిమాను రూ. 18 కోట్ల టార్గెట్‌గా రిలీజ్ చేశారు. రూ. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా బరిలోకి దిగింది. మూడు రోజుల్లో మేజర్ (Major) తన టార్గెట్‌ను చేరుకుంది.
Read More: నా కుమారుడు చనిపోలేదు.. అందరి హృదయాల్లో బ్రతికే ఉన్నాడు - మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి
Follow Us