బుల్లితెరపై ఈటీవీలో దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా ప్రసారమవుతున్న షో (Jabardasth) జబర్దస్త్. అప్పటి నుంచి ప్రేక్షకులను జబర్దస్త్ కార్యక్రమం తమదైన శైలిలో సందడి చేస్తోంది. కాగా, ఈ కార్యక్రమానికి మొదట్లో నటులు నాగబాబు, రోజా న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించారు. కొన్ని సంవత్సరాలు తెలుగు టెలివిజన్ చరిత్రలోనే ఈ కామెడీషో సంచలనాలు రేపింది. అయితే, అప్పట్లో బాగానే గడిచినా, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నాగబాబు (Nagababu) ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన స్థానంలో పలువురు నటులు, సింగర్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఇక, తాజాగా మరో జడ్జి రోజాకు మంత్రి పదవి రావడంతో ఆమె కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. దీంతో రోజా స్థానంలో కొన్ని రోజుల పాటు మాజీ హీరోయిన్లు పూర్ణ, ఇంద్రజ వంటి వారు వచ్చారు.
ఇక, ఇప్పటినుంచి జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమంలో ఇంద్రజ పర్మినెంట్ జడ్జిగా కొనసాగుతారని అనుకున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఎమైందో ఏమో కానీ.. తాజాగా ఈ కార్యక్రమం కోసం మరొక హాట్ బ్యూటీని రంగంలోకి దింపాలనే ఆలోచనలో మల్లెమాల వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎన్నో సినిమాలలో గ్లామరస్ పాత్రలో నటించిన హీరోయిన్ (Shraddha Das) శ్రద్ధా దాస్ ను జబర్దస్త్ కార్యక్రమంలోకి తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ బ్యూటీ కనుక ఈ కార్యక్రమంలో కి ఎంట్రీ ఇస్తే ఇక రేటింగ్స్ అమాంతం పెరిగిపోతాయనే చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే.. ఇన్ని రోజుల పాటు ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించిన రోజా.. జడ్జిమెంట్ తో పాటు కమెడియన్స్ చెప్పే డైలాగులను కూడా ముందుగానే చెబుతూ వారిపై సెటైర్లు వేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్మెంట్ పంచారు. అయితే సడెన్ గా రోజా వెళ్లిపోతున్నట్లు ప్రకటించడంతో ఈ కార్యక్రమానికి రేటింగ్స్ పడిపోతాయని చాలామంది భావించారు. ఇక, ఆమెతో పాటు ఈ కార్యక్రమానికి కీలకంగా ఉన్నటువంటి హైపర్ ఆది కూడా గత నెల రోజుల నుంచి ఈ కార్యక్రమంలో కనిపించలేదు. దీంతో (Jabardasth) జబర్దస్త్ కార్యక్రమం పూర్తిగా పడిపోయిందని అభిమానులు భావించారు. అయితే ఈ కామెడీ షోకు తిరిగి ఎలాగైనా పూర్వవైభవం తీసుకురావాలని మల్లెమాల వారు పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా హాట్ బ్యూటీ శ్రద్దాదాస్ (Shraddha Das) ను రంగంలోకి దింపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Follow Us