తెలుగు సింగింగ్ టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న షో "తెలుగు ఇండియన్ ఐడల్". ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో ఈ షో మొదలైంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ - సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్, సింగర్ కార్తీక్, హీరోయిన్ నిత్యామీనన్ లు ఈ టాలెంట్ హంట్ షోకి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో షోకి విశేషంగా ప్రేక్షకాదరణ లభిస్తోంది.
అయితే ఈ వారం సింగర్స్ మధ్య డబుల్ ధమాకా స్పెషల్ ఎపిసోడ్స్ జరిగాయి. కంటెస్టెంట్స్ కు తోడుగా ప్లే బ్యాక్ సింగర్స్ వచ్చి పాట పాడారు. కాగా, ఈ సందర్భంగా నిత్య మీనన్, థమన్ మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. సింగర్ శ్రావణ భార్గవితో జోడీ కట్టిన మారుతి.. 'MCA' సినిమాలోని 'ఏవండోయ్ నాని గారు' అనే పాటను ఆలపించారు. ఈ పాట విషయంలోనే వారిద్దరి మధ్య వివాదం జరిగింది.
నిన్నటితో ఈ షో లో డబుల్ ధమాకా ఎపిసోడ్ పూర్తి అయింది. ఈ నేపథ్యంలో ఇందులో భాగంగా జరిగిన ఈ రౌండ్ లో సింగర్లు లాలస, వైష్ణవి ఉత్తమ కన్సిస్టెంట్ సింగర్స్ గా ఎంపికయ్యారు. వీరు ఈ రౌండ్ లోని తమ ఉత్తమ ప్రదర్శనకు గానూ దీనికి ఎంపిక కావడం విశేషం. ఈ చివరి ఎపిసోడ్ కు టీమిండియా క్రికెటర్ హనుమ విహారి ప్రత్యేక అతిథిగా హాజరై వారికి ఈ అవార్డు అందజేశారు.
Follow Us