బుల్లితెర నటి రష్మీ ప్రభాకర్ (Rashmi Prabhakar) తాజాగా తన ప్రియుడిని వివాహం చేసుకొంది. ఏప్రిల్ 25వ తేదీన బెంగళూరులో ఉదయం 9.21 గంటల నుంచి 10.19 గంటల వరకు వీరి కల్యాణం ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత దిగిన ఓ సెల్పీతో ఆమె తన పెళ్లి వార్తను అభిమానులకు తెలియజేసింది. రష్మీ నిఖిల్ భార్గవ్ (Nikhil Bhargav) అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని రోజుల క్రితమే ఇరు కుటుంబాల పెద్దలు వీరి ప్రేమను అంగీకరించారు. దీంతో వీరి పెళ్లికి మార్గం సుగమమైనట్లయింది. కాగా, రష్మీ ప్రభాకర్ వివాహానికి తోటి కళాకారులు, నటులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే కోవిడ్ నిబంధనల వల్ల ఎక్కువ మందిని ఆహ్వానించలేదని తెలిసింది. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, సెల్ఫీలను స్నేహితులు సోషల్ మీడియా (Social Media)లో షేర్ చేశారు. దీంతో... వీరి పెళ్లి ఫోటోలు ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతున్నాయి.
ఇక రష్మీ ప్రేమ, పెళ్లి విషయాల్లోకి వెళితే.. 2021 నవంబర్‌లో సోషల్ మీడియాలో తన నిశ్చితార్థం ఫోటోలను పోస్ట్ చేసి అభిమానులకు షాకిచ్చింది. అనంతరం ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన రష్మీ.. తన ప్రేమ కథను అభిమానులతో పంచుకుంది. ఇందులో ఆమె తన భర్త నిఖిల్ భార్గవ్‌తో ఎలా ప్రేమలో పడింది.. నికిల్ చేసిన ప్రపోజల్, ఆ తర్వాత ప్రేమ నుంచి పెళ్లి వరకు ఎలా తమ జీవితం కొనసాగిందనే విషయాలను పూసగుచ్చినట్టు వివరించింది. నా భర్త ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేస్తారు.
మూడేళ్ల క్రితం జరిగిన ఓ ఈవెంట్‌లో డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్లినప్పుడు.. కామన్ ఫ్రెండ్ ద్వారా నిఖిల్‌ను కలిసినట్లు ఆమె పేర్కొంది. తొలుత మా ఇద్దరి స్నేహం బలపడిన అనంతరం మా ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు కలిశాయని తెలిపింది. ఆ తర్వాతి రోజే నిఖిల్ ప్రపోజ్ చేశాడని రష్మీ తెలిపింది. ఇక, నిఖిల్ ప్రపోజ్ చేసిన తర్వాత చాలా ఆలోచించానని పేర్కొంది. నా యాక్టింగ్ ప్రొఫెషన్‌ను నిఖిల్ పూర్తిగా అర్ధం చేసుకుంటాడు. ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుందో అతడికి తెలుసు. పెళ్లి తర్వాత కూడా నేను సీరియళ్లలో నటించడానికి ఆయనకు అభ్యంతరం లేదు. నన్ను నటిగా కొనసాగమని ఆయనే ప్రోత్సహిస్తున్నాడు. దాంతో నిఖిల్ ప్రపోజ్‌ను అంగీకరించాను. అందుకే అతడు నాకు సహభాగస్వామి అనీ... ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నాం అని రష్మీ వెల్లడించింది. తర్వాత మా రిలేషన్ గురించి నా తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కూడా సరే అన్నారు. దాంతో మా ప్రేమ మరో లెవెల్‌కు వెళ్లిందని రష్మీ తెలిపింది.
రష్మీ ప్రభాకర్ సీరియల్, సినిమా కెరీర్ విషయానికి వస్తే.. శుభ వివాహ సీరియల్ ద్వారా ఆమె తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించంది. ఆ తర్వాత మహాభారతం సీరియల్ లో ధుర్యోధనుడి చెల్లెలి పాత్ర పోషించడం ద్వారా కన్నడలో విశేషంగా అభిమానులను సంపాందించుకొన్నారు. అనంతరం తెలుగులో పౌర్ణమి, ప్రస్తుతం కావ్యాంజలి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. అంతేకాకుండా రష్మీ కన్నడలో బీబీ5, మహాకావ్య అనే సినిమాల్లో సైతం నటించారు.
Follow Us