తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) తొలి సినిమా జోష్. ఈ సినిమా ద్వారా కమెడియన్ గా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు జోష్ రవి (Josh Ravi). తన నటన తో ప్రేక్షకులను బాగా అలరించడంతో పాటు ఆయన పేరు ముందు సైతం ఆ సినిమా పేరును కూడా జోడించారు. అయితే, తొలుత ఈ సినిమా కంటే ముందు రెండు, మూడు చిత్రాలలో నటించినప్పటికీ ఆయనకు పెద్దగా గుర్తింపు వచ్చింది లేదు. దీంతో జోష్ సినిమాతో గుర్తింపు రావడంతో దానికి కృతజ్ఞతగానే తన పేరుకు ముందు ఈ మూవీ పేరును జోడించాడు.
సినిమాల్లో అవకాశాలు రాకముందు ఆయన బుల్లితెరపై జబర్దస్త్ (Jabardasth) కామెడీ షో తో ప్రేక్షకులను తనదైన శైలిలో నవ్వించారు. అనంతరం సినిమా అవకాశాలు సైతం ఎక్కువగా రావడంతో జబర్దస్త్ నుంచి తప్పుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఆయన ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పుకొచ్చాడు. తనకు బాగా పరిచయం ఉన్న దర్శకులు, నిర్మాతలు కారణంగా అవకాశాలు వస్తున్నాయని కూడా తెలియజేశాడు.
జబర్దస్త్ కమెడియన్లు ఎవరైనా బయట కనిపించారంటే.. అభిమానులు వారితో ఫొటోలు దిగడానికి పెద్ద ఎత్తున ఎగబడతారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జోష్ రవి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. జబర్దస్త్ నటులు ఫొటోల కోసం ఎవరైనా వారి దగ్గరికి వెళితే... తెగ బిల్డప్ ఇస్తారని అన్నారు. వారు పెద్ద హీరోలమని ఫీల్ అవుతారని చెప్పుకొచ్చారు. అయితే ఆ క్షణం వరకు మాత్రమే అది సాధ్యం అవుతుంది. ఆ తర్వాత తిరిగి మనం ఏంటో తెలుసు కాబట్టి ఆ ఊహ నుంచి బయటకు రావాలని ఆయన పేర్కొన్నారు.
ఇకపోతే ఒకానొక సమయంలో జబర్దస్త్ వాళ్ళతో ఫోటో దిగడానికి వెళితే కమెడియన్లు హీరోలుగా బిల్డప్ కొట్టి నాతో ఫోటో దిగలేదు... అలా వారిచేత నేను అవమానపడ్డానంటూ వాపోయాడు. కాగా, జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా జబర్దస్త్ ప్రోగ్రాం చూస్తూనే ఉంటానని.. నేను ఆ షో కు పెద్ద ఫ్యాన్ అని రవి తెలిపారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది స్కిట్ లు కనుక బాగుంటే పర్ఫామెన్స్ బాగుందని వారికి మెసేజ్ చేస్తానని తెలిపాడు.
Follow Us