బుల్లితెరపైనే కాకుండా వెండి తెరపై అందరూ మెచ్చే అందాల యాంకర్ అనసూయ (Anasuya Bharadwaj). ఈ హాట్ యాంకర్ బుల్లితెరపై గ్లామర్ ఒలకబోస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతోంది. ఇటీవల ఈ భామ అల్లు అర్జున్ పుష్ప (Pushpa) చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. నటుడు సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించింది. దీంతో పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలో పెరిగింది.
ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఓ రేంజ్ లో రచ్చ చేస్తోంది. సినిమాల ఎంపిక విషయంలోనూ ఈ హాట్ బ్యూటీ ఎప్పుడూ తొందరపడదు. ఆచితూచి అడుగులు వేస్తూ... సినిమాలను ఎంచుకుంటోంది. అయితే, అందివచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. అందుకే పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది.
ఇప్పటివరకు నటించిన క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణం సినిమాలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా ఈ భామ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా ఎంతో మెప్పించింది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది.
తాజాగా అనసూయ తన లేటెస్ట్ ఫోటోస్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో కోసం అనసూయ ఈ హాట్ ఫోటో షూట్ చేసింది. అయితే, అనసూయకు చీరకట్టులో వయ్యారాలు ఒలకబోయడం కొత్తేమీ కాదు. కానీ ఈసారి ఈ హాట్ యాంకర్ చీరకట్టులోనే కొత్తగా కనిపించేందుకు ట్రై చేసింది.
గ్రే కలర్ లో ఉన్న చీరలో అనసూయ (Anasuya Bharadwaj) వయ్యారాలు ఒలకబోస్తూ తన సన్నని నడుము సొగసును చూపిస్తోంది. అయితే, ఈ ఫొటోల్లో అనసూయ ట్రై చేసిన హెయిర్ స్టైల్ చాలా విభిన్నంగా ఉంది. కానీ, ఫ్యాన్స్ కి ఈమె కొత్త హెయిర్ స్టయిల్ అంతగా నచ్చినట్లు లేదు. ఈ నేపథ్యంలో కొందరు బాగాలేదు అని కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు డిఫెరెంట్ గా ఉందని.. అనసూయకు హాట్ నెస్ ఎక్కువైందని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పుష్ప చిత్రంతో అనసూయ బాలీవుడ్ ప్రేక్షకులకు సైతం దగ్గరైంది. ఈ నేపథ్యంలో అనసూయ త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోందంటూ నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి.
Follow Us