Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఇంటికి కొత్త వారసుడు.. ఫ్యామిలీలో పండుగ వాతావరణం!

Advertisement
సుడిగాలి సుధీర్ ఫ్యామిలీ (Sudigali Sudheer Family)

Sudigali Sudheer: జబర్దస్త్.. తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూ ఇప్పటికీ నెంబర్ వన్ కామెడీ షోగా హవాను చూపిస్తోంది. ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు, కమెడియన్లు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే స్టార్లుగా మారారు. అలా స్టార్ గా మారిన వారిలో సుడిగాలి సుధీర్ ఒకడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన సుధీర్ చాలా తక్కువ సమయంలో తన సత్తాను నిరూపించుకుని స్టార్‌గా మారాడు. ఇక, అప్పటి నుంచి సుధీర్ వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతున్నాడు. 

అయితే, కొంత కాలంగా షోలు, సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న సుధీర్ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) గా పేరు తెచ్చుకున్న సుధీర్ ముందుగా మ్యాజిక్‌లు చేసుకుంటూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఎన్నో ఛానెళ్లలో మ్యాజిక్ షోలు చేస్తూ ఉండేవాడు. సరిగ్గా అలాంటి సమయంలోనే జబర్దస్త్ కమెడియన్ల దృష్టిలో పడటంతో అందులో ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే తన టాలెంట్ ను చూపించుకున్నాడు. 

Advertisement

దీంతో షో నిర్వాహకులు సుధీర్‌కు తక్కువ సమయంలోనే టీమ్ లీడర్‌గా ప్రమోషన్ అందించారు. అందుకు తగ్గట్టుగానే తాను కూడా ఎక్కడా తగ్గకుండా కామెడీ, డ్యాన్స్, మ్యాజిక్ ఇలా అన్నింట్లోనూ సత్తా చాటుతూ ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు. అయితే, సుధీర్ జర్నీలో సగం క్రేజ్ తెచ్చి పెట్టింది యాంకర్ రష్మీ. చాలా కాలంగా రష్మితో (Anchor Rashmi) వ్యవహారం నడుపుతున్నట్లు కనిపిస్తూ అందరిలో హాట్ టాపిక్ అయ్యాడు. సుదీర్ఘ కాలంగా సుధీర్ టీవీలో సత్తా చాటి ఇంక చాలనుకున్నాడో ఏమో ఈ క్రమంలోనే సినిమాల్లోకి కూడా అడుగు పెట్టాడు. 

అప్పుడప్పుడు సుధీర్ తమ్ముడు కూడా స్కిట్లలో కనిపిస్తుంటాడు. రోహన్ కూడా అప్పుడప్పుడు స్టేజి మీద కనిపిస్తూ పంచ్ డైలాగ్స్ తో అలరిస్తూ ఉంటాడు. అయితే సుధీర్ ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ రోహన్.. సుధీర్ (Sudigali Sudheer) కంటే ముందుగానే వివాహం చేసుకున్నాడు. తాజా సమాచారం ఏమిటంటే రోహన్ భార్య ఇటీవలే డెలివరీ అయింది. ఆ డెలివరీలో రోహన్ భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని అంటున్నారు. 

దీంతో సుధీర్ పెదనాన్న అయ్యాడంటూ సోషల్ మీడియాలో (Social Media) పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సుడిగాలి సుధీర్ ఇంట సంబరాలు కూడా మొదలయ్యాయని అంటున్నారు. సుధీర్ తమ్ముడు రోహన్ తండ్రి కావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నాడట. ఆయన ఫ్యామిలీ మొత్తం సంబరాలు చేసుకుంటుండగా ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సుధీర్ కి సైతం విషెస్ చెబుతున్నారు.

Advertisement
You May Also Like These
Advertisement