దేశంలోనే మరే షోకూ దక్కనంత రేటింగ్‌ను సొంతం చేసుకున్న షో బిగ్ బాస్ (BiggBoss NonStop). ఈ షో చాలా భాషల్లో వస్తున్నా.. మన దగ్గర మాత్రం సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఈ నేపథ్యంలో బిగ్బ బాస్ నిర్వాహకులు రెట్టించిన ఉత్సాహంతో వరుసపెట్టి సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను కూడా జనరంజకంగా నడుస్తోంది. ప్రస్తుతం ఈ షో తుది దశకు చేరుకోవడంతో మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ వారం నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్లందరికీ బిగ్ బాస్ షాకిచ్చినట్లు తెలుస్తోంది.
అయితే, బిగ్ బాస్ (BiggBoss NonStop) లో గతంతో వచ్చిన ఐదు సీజన్లు ఒకదానికి మించి మరొకటి అన్నట్లు సక్సెస్ అయ్యాయి. దీంతో తొలిసారి ఓటీటీ వెర్షన్ అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్‌పై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకనుగుణంగానే ఈ షో ఆరంభం నుంచి ఇప్పటివరకు భారీ స్పందనను దక్కించుకుంది. దీనికి కారణం ఇందులో చూపించే కంటెంటే. అందుకే ఈ షో పాత సీజన్లను మించేలా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. అయితే, బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి 17 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు గత సీజన్లలో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. వీరిలో నుంచి గడిచిన 10 వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీ, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపు, మహేశ్ విట్టా, అజయ్ కుమార్, హమీదా, అషు రెడ్డిలు ఎలిమినేట్ అయ్యారు.
అయితే, బిగ్ బాస్ (BiggBoss NonStop) షో మొత్తంలోనే ఎంతో ముఖ్యమైన నామినేషన్స్.. ఎలిమినేషన్స్ అనేవి ప్రస్తుత బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో మాత్రం ఊహించని విధంగా జరుగుతున్నాయి. గడిచిన పది వారాలకు గానూ జరిగిన ఎలిమినేషన్స్‌లో ఎవరూ ఊహించని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే బయటకు వెళ్లారు. దీంతో 11వ వారానికి జరిగిన నామినేషన్ ప్రక్రియను సరికొత్తగా డిజైన్ చేశారు. ఇందులో భాగంగా హౌస్‌లోని కంటెస్టెంట్లు నామినేట్ చేయాలనుకున్నవారిని ముగ్గురిని ఎంచుకోవాలి. వాళ్లను గార్డెన్ ఏరియాలో ఉన్న ఎగ్జిట్ బోర్డు కింద నిల్చోబెట్టాలి. ఆ తర్వాత అందుకు తగిన కారణాలను చెప్పి నామినేట్ చేయాలి. అయితే, ఈ వారానికి కెప్టెన్ ఎవరూ లేకపోవడంతో కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనాల్సి వచ్చింది.
దీనికి సంబంధించిన ప్రోమో (Promo) తాజాగా విడుదలైంది. దీంతో 11వ వారం నామినేషన్ ప్రక్రియ కూడా గొడవలతోనే సాగినట్లు ఈ ప్రోమోను బట్టి అర్థమవుతోంది. ఇక, ప్రోమోలో బిందు మాధవి.. మిత్ర శర్మ, అఖిల్ సార్థక్, నటరాజ్ మాస్టర్‌లను ఎంచుకుని నామినేట్ చేయడంతో వారు ఆమెపై మాటల దాడి చేశారు. నటరాజ్ అయితే ఏకంగా ఆమె తెలుగమ్మాయి కాదని.. వాళ్ల నాన్న మంచిగా పెంచలేదని అన్నాడు. ఇదిలా ఉంటే.. ఈ వారానికి సంబంధించి కంటెస్టెంట్స్ అందరూ నామినేట్ అయ్యారు. దీంతో గ్రాండ్ ఫినాలేలోకి ఎవరు అడుగు పెట్టాలన్నది జనాల చేతిలోనే ఉంచారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇక, ఈ వారం నామినేషన్‌లో ఉన్న బాబా భాస్కర్ వద్ద 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' ఉండడంతో ఆయన ఈ వారం స్వయంగా తనను తాను సేఫ్ చేసుకోవచ్చు. లేదా ఎవరికైనా వాడుకోవచ్చు. తనకే వాడుకుంటే ఫినాలేకు వెళ్లిపోవచ్చు.
Follow Us