మనం వర్క్ చేసే చోట మన బంధువులు కూడా ఉండవచ్చు. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా. నటుల మధ్య రిలేషన్స్ గురించిన ఇంట్రస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటారు అభిమానులు. సినిమా చుట్టురికాల గురించిన వివరాలు మీ కోసం.
శ్రీకాంత్, గోపిచంద్
శ్రీకాంత్‌కు బంధుత్వం పరంగా గోపీచంద్ వరసకు కొడుకు అవుతారు. శ్రీకాంత్ అక్క కూతురుని గోపించంద్ పెళ్లి చేసుకున్నారు. మేనకోడలు భర్త కొడుకేగా.
రామ్, శర్వానంద్
హీరోలు రామ్, శర్వానంధ్లు బావ, బావమరుదులు. రామ్ అక్కను శర్వానంద్ అన్నయ్య పెళ్లి చేసుకున్నారు.
పోసాని మురళి, బోయపాటి శ్రీను, కొరటాల శివ
నటుడు. రచయిత పోసాని కృష్ణ మురళికి బోయపాటి శ్రీను అలాగే కొరటాల శివ ఇద్దరు దగ్గరి బంధువులు. బోయపాటి శ్రీను అన్నయ వరస .. కొరటాల శివకు మావయ్య వరస అవుతారు.
చోటా కె నాయడు, సందీప్ కిషన్
సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు హీరో సందీప్ కిషన్‌కు మేనమామ అవుతారు.
సిరివెన్నెల, త్రివిక్రమ్
సంగీత రచయిత సిరివెన్నల సీతారామశాస్త్రి మేనకోడలిని దర్శకుడు త్రివిక్రమ్ పెళ్లి చేసుకున్నారు. దీంతో త్రివిక్రమ్‌కు సిరివెన్నల బాబాయి అయ్యారు.
పవన్ కళ్యాణ్, మెహర్ రమేష్
మెహర్ రమేష్ మెగా పవన్ కళ్యాణ్‌కు బావమరిది వరస అవుతాడు.
సుద్దాల అశోక్, ఉత్తేజ్
నటుడు ఉత్తజ్కు సుద్దాల అశోక్ తేజ మేనమామ అవుతాడు.
గుణ్ణం గంజరాజు, రమా
రచయిత, దర్శకుడు, నిర్మాత గుణ్ణం గంగరాజుకు దర్మకుడు రాజమౌళి భార్య రమా వరసకు చెల్లెలు అవుతారు.
గుణ్ణం గంజరాజు, రమా, చంద్రశేఖర్ ఏలేటి
దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి చెల్లెలు గుణ్ణం గంగరాజు భార్య. వీరిద్దరూ బావ, బావమరుదులు అవుతారు.
ఏఎమ్ రత్నం, రవికృష్ణ
7/ జీ బృందావనం సినిమా హీరో రవికృష్ణ తండ్రి ఏమ్ రత్నం.
Follow Us