వర్షం, మిర్చి.. ఈ స్థాయి కథను ప్రభాస్ (Prabhas) ఎంచుకోవాల్సింది: రాధే శ్యామ్ పై పరుచూరి వారి మాటలు

పరుచూరి పలుకులు యూట్యూబ్ ఛానల్ ద్వారా వివిధ సినిమాలపై విశ్లేషణ, విమర్శ పాఠాలు చెబుతున్నారు గోపాలకృష్ణ

ప్రముఖ సంభాషణల రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్ "పరుచూరి పలుకులు"లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. రాధే శ్యామ్ సినిమాపై తను విశ్లేషించిన అంశాలను ఆయన ప్రేక్షకులతో పంచుకున్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌కు ఒక ఇమేజ్ అనేది ఏర్పడిందని.. ఆ ఇమేజ్‌కు తగ్గ కథలను ఆయన ఎంపిక చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అన్నారు. రాధే శ్యామ్ (Radhe Shyam) సినిమాలో లోపాలు ఏవీ లేవని ఆయన తెలిపారు. 

కొన్ని సినిమాలకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని.. పాతాళభైరవి కంటే మల్లీశ్వరి ముందు విడుదల అయ్యుంటే అది సూపర్ హిట్ అయ్యేది అని, అలాగే  రాధే శ్యామ్ సినిమా కూడా గొప్ప కథే అయినప్పటికీ, టైటిల్ పోషించిన పాత్ర ఏమిటో కూడా దర్శకులు తెలుసుకోవాలని అన్నారు. రాధా శ్యామ్ అనే టైటిల్ రాధా, కృష్ణుల పవిత్రమైన ప్రేమను గుర్తుచేస్తుందని, కాకపోతే అది విఫలమైన ప్రేమని ఆయన అభిప్రాయపడ్డారు. 

అలాగే ఒక లవ్ స్టోరీకి అద్భుతమైన పాటలు ఉండాలని, కానీ రాధే శ్యామ్‌లో పాటలు కథలో భాగంగా వస్తుంటాయని పరుచూరి అభిప్రాయపడ్డారు. రాధే శ్యామ్‌లో కథాబీజం పామెస్ట్రీ అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని నడుస్తుందని, కాకపోతే అంత గొప్ప కళ కూడా 99 శాతం ప్రామాణికతను మాత్రం సూచిస్తుందని, 1 శాతం వ్యక్తులకు అది వర్తించపోవచ్చని చెప్పిందని తెలిపారు. 

ముఖ్యంగా రాధే శ్యామ్‌లో (Radhe Shyam) తార, ప్రేరణ, విక్రమాదిత్య అనే మూడు పాత్రలు చాలా ప్రధానమని.. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ జీవితంలో ముందుకెళ్లేందుకు అందరూ ప్రయత్నించాలనే సందేశాన్ని ఇవి ఇస్తున్నాయని పరుచూరి అభిప్రాయపడ్డారు. తను ఈ సినిమాను చూడమనే చెబుతానని అన్నారు. ప్రస్తుతం రాధే శ్యామ్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో లభ్యమవుతున్న సంగతి తెలిసిందే. 


 

Credits: Instagram
You May Also Like These