ఓటీటీలోకి మహేష్‌బాబు (MaheshBabu) ‘సర్కారు వారి పాట’ సినిమా వచ్చేది ఎప్పుడంటే?

సర్కారు వారి పాట సినిమా పోస్టర్

సూపర్‌‌స్టార్‌ మహేష్‌బాబు (MaheshBabu), కీర్తి సురేష్‌ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘సర్కారు వారి పాట’. మే 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ అయిన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లు వసూలు చేసింది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.160.2 కోట్ల గ్రాస్‌,  రూ.100.44 కోట్ల షేర్‌ సాధించి రికార్డు సృష్టించింది. తాజాగా ఈ సినిమా రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరింది. రిలీజ్ అయిన కేవలం 12 రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్‌ వసూళ్లు రాబట్టింది.  

రిలీజ్‌ అయ్యి 12 రోజులు గడుస్తున్నా థియేటర్‌‌లో ఈ మూవీ ఇప్పటికీ సందడి చేస్తోంది. అయితే సర్కారు వారి పాట సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని మహేష్‌ అభిమానులతోపాటు సినీ ప్రేమికులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ను అమెజాన్‌ ప్రైం భారీ రేటుకు దక్కించుకుందని ఇండస్ట్రీ టాక్. ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తికరమైన అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

అయితే అగ్రిమెంట్ ప్రకారం థియేటర్‌‌లో రిలీజ్‌ అయిన నెల రోజులు పూర్తికాక ముందే సర్కారు వారి పాట సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని టాక్‌. ఈ వార్తల ప్రకారం మే నెలాఖరున, జూన్‌ 10న మహేష్‌బాబు (MaheshBabu) ‘సర్కారు వారి పాట’ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతోందని తెలుస్తోంది. అయితే, ఈ రెండు తేదీలు కాకపోతే జూన్‌ 10న లేదా జూన్‌ 24 నుంచి ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే పెద్ద సినిమాలు థియేటర్‌‌లో రిలీజ్ అయిన నెలరోజుల తర్వాత మాత్రమే ఓటీటీలోకి వస్తాయి.

You May Also Like These