పవర్‌స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) షెడ్యూల్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. ఒక పక్క వరుసగా సినిమాలు ఓకే చేస్తూ షూటింగ్ చేస్తున్న పవన్, జనసేన కార్యక్రమాల్లో కూడా బిజీగా గడుపుతున్నారు. ఇంత బిజీలో కూడా సినిమా ప్రొడక్షన్ చేయాలని పవన్ యోచిస్తున్నారని తెలుస్తోంది. చాలాకాలంగా తన నిర్మాణంలో వరుసగా సినిమాలు చేయాలని ఆయన భావిస్తున్నాడు. దీని కోసం ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్రియేషన్స్ పేరుతో బ్యానర్‌ను కూడా స్థాపించాడు పవర్‌స్టార్.
తనకు సినిమా నిర్మాణంపై ఆసక్తి ఉందని పవన్ కొన్ని సంవత్సరాల క్రితమే ప్రకటించాడు. ఆ సమయంలోనే తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కొడుకు రాంచరణ్‌తో తొలి సినిమా నిర్మిస్తానని వెల్లడించాడు. అయితే అది కేవలం ప్రకటనతోనే ఆగిపోయింది. తాజాగా తన బాబాయ్ పవన్ కల్యాణ్ నిర్మాణంలో సినిమా గురించి రామ్ చరణ్ మాట్లాడాడు. తనకు తానుగా వెళ్లి తనతో సినిమా తీయమని బాబాయ్‌ను ఎలా అడగాలని ప్రశ్నించాడు? అది బాబాయ్‌కే అనిపించాలని అన్నాడు. కథ ఓకే అనుకుని, అది తనకు సరిపోతుందని అనుకుంటే తన బాబాయ్ పవన్ నిర్మాణంలో తప్పకుండా సినిమా చేస్తానని అన్నాడు రాంచరణ్
తమ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందని రామ్ చరణ్ అనౌన్స్ చేసినప్పటికీ, అది ఎప్పుడు అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. అదే విధంగా తన నిర్మాణంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో సినిమా చేయాలని ఉందని రామ్ చరణ్ తన మనసులో మాట చెప్పాడు. సరైన కథ దొరికితే కల్యాణ్ బాబాయ్‌తో కచ్చితంగా సినిమా నిర్మిస్తానని అన్నాడు. వీళ్ల ప్రకటనల సంగతి ఎలా ఉన్నా.. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే రెండు సినిమాల కోసం మెగా ఫ్యాన్స్ వేచి చూడక తప్పదు.
ఇక, చిరంజీవి, రాం చరణ్ (Ram Charan) కలిసి నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్.
Follow Us